Wednesday, October 4, 2023

కేసీఆర్ కామారెడ్డికి పారిపోయాడు..

తప్పక చదవండి
  • నేను ముందునుంచే చెబుతున్నాను..
  • బీ.ఆర్.ఎస్. అభ్యర్థుల ప్రకటనపై రేవంత్ రియాక్షన్..
  • కేసీఆర్ గొంతులో భయం, ఓటమి కనిపించాయి..
  • ఈ లిస్ట్ చూశాక మాకు మరింత నమ్మకం కలిగింది..
  • కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం : రేవంత్..
    హైదరాబాద్ :
    ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డికి పారిపోతున్నారని తాను మొదటి నుంచి చెప్తున్నానని టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనపై స్పందించిన ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గొంతులో భయం, ఓటమి స్పష్టంగా కనిపించిందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ చూసిన తర్వాత రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఏర్పడిందన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మార్పు చేసి కేసీఆర్ ఓటమిని ఒప్పుకున్నారన్నారు. గజ్వేల్‌లో ఓడిపోతానని భయంతోనే కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని.. కేసీఆర్ స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను గజ్వేల్, కామారెడ్డి రెండు స్థానాల్లో ఓడించి తీరుతారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఎనలేని సేవ చేశారని.. కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటకు వెళ్లకుండా కామారెడ్డికి ఎందుకు వెళ్తున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

50 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి చేసింది అని అడగడానికి కేసీఆర్ కు సిగ్గుండాలి.. రెండు సార్లు అవకాశం ఇస్తే మీరు ఏమి చేశారని ప్రశ్నించారు.. కేసీఆర్ ఉద్యమం చేయడం ఓకే.. కానీ కాంగ్రెస్ నాయకులు ఉద్యమాన్ని నిలబెట్టారన్నారు.. 2014 కంటే ముందు జరిగిన ప్రతి నిర్ణయంలో కేసీఆర్ ఉన్నారని, అప్పుడు జరిగింది పాపమే అయితే ఆ పాపంలో కేసీఆర్ కూడా భాగం ఉన్నట్టే కదా..? ఆనాటి పాపాలకు కేసీఆర్ పాపాల భైరవుడు అన్నారు.. తెలంగాణ అభివృద్ధి అంతా కాంగ్రెస్ చేసిందేనని, 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి చేసిందో చర్చకు సిద్ధమా..? అని సవాల్ విసిరారు.. 2014 నుంచి 2023 వరకు రూ. 23 లక్షల కోట్ల బడ్జెట్ తో సీఎం కేసీఆర్ ఏమి చేశారో చర్చకు సిద్ధమా..? అన్నారు రేవంత్.. ఉచిత విద్యుత్, పెన్షన్ లాంటి ఆలోచన చేసింది, ఇచ్చింది కాంగ్రెస్ అని, 50 ఏళ్లలో ఏమి చేసిందో..? ఏమి చేయలేదో దీనిపై చర్చకు కేసీఆర్ సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు.. కేసీఆర్ తన తల్లి దండ్రుల పేర్లు తప్ప మిగతావన్నీ అబద్దాలు చెబుతారని రేవంత్ ఎద్దేవా చేశారు.. కేసీఆర్ ప్రగతి భవన్ గోడలపై రాసుకో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. నాలుగువేల పెన్షన్ ఇస్తాం.. కాంగ్రెస్ అంతా షబ్బీర్ అలీకి అండగా ఉండి కేసీఆర్ పని పడుతాం’ అని అన్నారు. ఏ పెద్ద ఒప్పందం జరిగినా… పది రోజులకు మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్తారని.. ప్రజలు నీళ్లలో మునిగి చనిపోయారు.. కేటీఆర్ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. కేటీఆర్ చేసిన సవాలును స్వీకరిస్తున్నామన్నారు. 119 అభ్యర్థులతో పైసలు, మందు పంచమని ఓట్టు వేపిస్తా, మీరు సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. యాదాద్రికి రమ్మంటారా?.. నాంపల్లి దర్గాకి రమ్మంటారా?.. మెదక్ చర్చికి వెళ్దామా? అమరవీరుల స్థూపం దగ్గర ప్రమాణం చేయమన్నా మేం సిద్ధమే అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు