Monday, September 9, 2024
spot_img

జనగామ మున్సిపల్ సర్వసభ్య సమావేశం..

తప్పక చదవండి

జనగామ : మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున ఆధ్వర్యంలో అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ సువాసిని పాల్గొన్నారు.. బిజెపి మున్సిపల్ కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్ర గుప్త మాట్లాడుతూ.. జనగామ పట్టణంలో ప్రజలు డెంగ్యూ వైరల్ ఫీవర్ తో చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ప్రత్యేక సానిటేషన్ ద్వారా బ్లీచింగ్, ఫాగింగ్ పట్టణమంతా చేయించాలని, అలాగే ప్రత్యేక డ్రైవ్ ద్వారా శానిటేషన్ చేయించి మురికి కాలువలు తీయించాలని అన్నారు.. అదే విధంగా గుంతలు పడ్డ రోళ్లను మరమ్మతు చేయాలని, వాటితో వృద్ధులు, పిల్లలు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని వెంటనే గుంతలను పూడ్చి సమస్యను పరిష్కరించాలని కోరారు.. బండ పద్మ మాట్లాడుతూ వార్డుల్లో ఉదయం పూట పొల్యూషన్ సౌండ్ తో ఇబ్బంది పెడుతున్నారని, అలా కాకుండా చూడాలని మరి అదే విధంగా బస్టాండ్ ఏరియాలో రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారని, ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.. గుర్రం భారతి మాట్లాడుతూ నా ఏరియాలోని ధోభీ ఘాట్ ఎత్తివేసి వేరే చోట మార్చాలని కోరారు.. వంగాల కళ్యాణి మాట్లాడుతూ అధికారులు ఫోన్ చేసినప్పుడు సరైన స్పందించటం లేదని, కనీస గౌరవం ఇవ్వడం లేదని, వార్డు సమస్యలు చెప్పుకుందామంటే అందుబాటులో ఉండడం లేదని అన్నారు.. పాండు, సమద్ మాట్లాడుతూ.. వార్డులో టెండర్ వేసిన కాంట్రాక్టర్ పనిచేయడం లేదని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడంలేదని అధికార పార్టీ కౌన్సిలర్లకు మాకే ఇబ్బంది అయితే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పొడియం దగ్గరికి వెళ్లారు.. రామ్ చందర్ మాట్లాడుతూ చికెన్, మటన్ డాక్టర్ సర్టిఫికెట్ లేకుంటేనే స్టాంపు ముద్రించకుండానే అమ్ముతున్నారని, కుళ్ళిపోయిన మాంసాన్ని అమ్మడం వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని, వాటిపై వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.. బొట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఫండ్ నుండి మున్సిపాలిటీకి నిధులు కేటాయించి వార్డుల అభివృద్ధిలో తోడ్పడాలని కోరారు.. సుధా మాట్లాడుతూ మావార్డులో అక్రమ కట్టడాలు కడుతున్నారని, ఒక ట్రాక్టర్ మొరం కూడా పోయడం లేదని అన్నారు.. మంత్రి సుమలత, ఉడుగుల శ్రీలత మాట్లాడుతూ.. కుక్కల బాధ, కోతల బాధ విషయం ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మల్లేష్ మాట్లాడుతూ వార్డు అభివృద్ధి విషయంలో అధికారులకు ఎన్నిసార్లు విన్నపం చేసిన కౌన్సిల్ గ్రూపులో పెట్టిన కూడా స్పందించడం లేదని వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు.. 11 ఎజెండా అంశాలలో 4 ఏజెండాలు తిరస్కరించి, మిగతావి ఆమోదం తెలపడం జరిగినది. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థల సుహాసిని మాట్లాడుతూ అధికారులు తప్పనిసరిగా కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు వాటి సమస్యలు దృష్టికి తెచ్చినప్పుడు ప్రతి సమస్యను పరిష్కరించి వారి దృష్టికి తీసుకెళ్లాలని, ప్రతి విషయాన్ని నేను ఫాలోఫ్ లో ఉంటానని అధికారులు నిర్లక్ష్యం వహిస్తే మేము జారీ చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రజిత, డీఈ చంద్రమౌళి, టీపీఓ సానిటరీ ఇన్స్పెక్టర్, వైస్ చైర్మన్ రాంప్రసాద్, మేనేజర్ రాములు తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు