ఆధునిక భారతదేశ పారిశ్రామిక ప్రగతి పథానికి రూపకల్పన చేసిన మహానీయులలో ప్రసిద్ది చెందినవాడుగా, సహజ వనరు లను సంపూర్ణంగా వినియోగించుకొని ఆర్థికంగా పారిశ్రామికంగా జాతీయ పురోభివృద్ధి సాధనకు ప్రణాళికలను రూపొందించి అమలు పరిచిన సాంకేతిక ఆర్థికవేత్త సర్. శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సాంకేతిక నిపుణుడుగా ప్రపంచం మెచ్చిన అతికొద్ది మంది ఇంజనీర్లలో విశ్వేశ్వరయ్య ఒకరు. నీటి పారుదల, పారిశ్రామిక నైపుణ్య ఉత్పత్తి వంటి విషయాల్లో సాటిలేని మేటి. మూసీ నది పై ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వంటి నిర్మా ణాలు చేసి హైదరాబాదు నగరమును వరదలనుండి కాపాడి, నగర ప్రజలకు గండికోట చెరువు నీటి ద్వారా దాహార్తిని తీర్చిన ప్రతిభావంతుడు. ఇతను 1861 సెప్టెంబర్ 15 న కర్ణాటక రాష్ట్రం లోని యద్దహళ్లిలో జన్మించాడు. విశ్వేశ్వరయ్య పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా, ప్రకాశం జిల్లా సరిహద్దులలోని మోక్షగుండం నకు చెందిన వారు అని కొందరి వాదన. కొన్ని తరాల కిందట వారి కుటుంబీకులు కర్ణాటక రాష్ట్రానికి వలస వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. బాల్యం నుండే మంచి ప్రతిభాశాలిగా, చురుకైన విద్యార్థిగా పలువురి మన్ననలను పొందాడు. ఇతను ఇంజనీరింగ్ విద్యలో పట్టభద్రులు. ఉదోగ్య రీత్యా ఆంగ్లేయుల పరిపాలనాకాలం లోనే దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇంజ నీరింగ్ శాఖలో అసమాన ప్రతిభను కనబరుస్తూ దేశ పురోభి వృద్దికి పాటుబడ్డారు.1901లో భారత ప్రభుత్వ ప్రతినిధిగా విశ్వేశ్వరయ్య జపాన్ దేశం వెళ్ళి అక్కడ కుటీర పరిశ్రమలను అధ్యయనం చేసి ఆవిధంగానే తన మేథా సంపత్తి, అద్బుతమైన మార్గదర్శకత్వంతో భారతదేశంలో కుటీర పరిశ్రమల అభివృద్దికి బృహత్ పథకాన్ని సిద్దపరచి ప్రభుత్వానికి ఒక నివేదికను అందించారు. జపాన్ పర్యటానంతరం విశ్వేశ్వరయ్య పూణే నగర నీటి సరఫరా పథకాన్ని రూపొందించారు. ఈ నిర్మాణ కాలంలోనే ఆయన ‘ఆటోమేటిక్ స్లుయిజ్’ గేట్‌ను రూపొందించారు. 1909-12లలో మైసూర్ ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్‌గా పనిచేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ అనంతరం మైసూరు రాష్ట్ర దివానుగా సత్వర పురోభివృద్దికి పాటుబడ్డారు. ఆనాటి మైసూరు రాస్ట్రం అన్ని రంగాలలో సాధించిన ప్రగతికి ఈయనే మూలపురుషుడు. మైసూరు విశ్వవిద్యాలయాన్ని, కృష్ణ రాజ సాగర్ నీటి పారుదల ప్రాజెక్టును, లక్కపల్లి ప్రాజెక్టు నిర్మాణం, భద్రావతిలోని ఇనుము ఉక్కు పారిశ్రామిక కర్మాగారాన్ని విశ్వేశ్వరయ్య రూపొందింప చేశారు.1913లో ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్’ నుమైసూర్ మహా రాజు కృష్ణ రాజా వడియార్ ప్రోత్సాహముతో స్థాపించాడు. ఒకసారి తన స్వంత పని మీద విదేశాలకు వెళ్లేందుకు చేతిలో పైకము లేక తన దగ్గర వున్న బాండ్ లను అదే బ్యాంక్‌లో తాకట్టు పెట్టి అప్పు తీసుకొని ఆ అప్పుకు వడ్డీ కూడా చెల్లిస్తాడు. బ్యాంక్ స్థాపకులు వీరే అయినప్పటికీ బ్యాంక్ నియమ నిబంధనలను పాటించి, సత్సంప్రదాయమును నెలకొల్పారు. మైసూరు సంస్థాన దివాను పదవీ బాధ్యతలను చేపట్టినప్పటినుండి బీద, వెనుకబడిన వర్గాలు, దళిత వర్గాల శ్రేయస్సును కోసం ఎన్నో పథకాలను అమలు చేశారు. విశ్వేశ్వరయ్య సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. అస్పృశ్యతా నివారణ కోసం ‘‘సివిల్ అండ్ సోషల్ ప్రోగ్రెసివ్ అసోషియేషన్’’ స్థాపించారు. ప్రజలలో సాంఘిక చైతన్యమును పెంపొందించుటకు కృషి చేసెను. బొంబాయి, గ్వాలియర్, హైదరాబాద్, నాగపూర్, పూణే, సూరత్ మొదలైన నగరాలలో నీటి పారుదల పథకాల ప్రాజెక్టులను నిర్మించారు. 1931 వ సంవత్సరం నాటికే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఐదవ స్నాతకోత్సవ సమావేశంలో దేశంలో సాంకేతిక విజ్ఞానం, కట్టుదిట్టమైన సాంకేతిక విద్యా ప్రణాళికా ప్రగతి, సామాన్య ప్రజలకు సాంకేతిక విజ్ఞాన ప్రయోజనాల లబ్ధి గురించి విశ్వేశ్వరయ్య చక్కగా వివరించారు. 1934 సంవత్సరం నాటికే విశ్వేశ్వరయ్య ‘భారతదేశమూ-ప్రణాళి కాబద్దమైన ఆర్థికాభివృద్ది’ అనే గ్రంధా న్ని రచించి ప్రపంచంలోని ఇతర దేశాల ఆర్థికాభి వృద్దికీ మనదేశపు ఆర్థికాభివృ ద్దికీ వ్యత్యాసం ఎందువల్ల ఏర్పడిర దో అందుకు గల కారణాలేమిటో, వీటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలేమిటో ఈ గ్రంధం నందు చక్కగా వివరిం చారు. సేద్యపు నీటి వనరుల గరిష్ట ప్రయోజన ప్రణాళికలు, మురుగునీటి పారు దల పథకాలు, మంచినీటి సరఫరా ప్రణాళి కలు గురించి భారత దేశంలోని ఏ నగరంలో, ఏ ప్రాంతంలో అమలు జరపాలన్నా, ఏ నది పై ఆనకట్టను కానీ, రిజర్వాయర్లు కానీ నిర్మించాలన్నా విశ్వేశ్వరయ్య సలహా సంప్రదింపులు తప్పనిసరిగా తీసుకోవడం జరిగేవి. ఆనాటి ఇంజనీర్లలో స్పూర్తి, మార్పు తెచ్చిన వ్యక్తిగా ప్రశంసలు అందుకొన్న నవ భారత నిర్మాత విశ్వేశ్వరయ్య నూరేళ్ల జీవించిన విశ్వేశ్వరయ్య ఒక్క క్షణం గూడా తన సమయాన్ని వృధా చేయకుండా దేశ హితం కోసం, దేశ సౌభాగ్యం కోసం పాటుపడిన మహామనిషి సర్. శ్రీ మోక్షగుండం విశ్వేశ్వ రయ్య. స్వతంత్ర భారత దేశం 1955 లో దేశ అత్యున్నత పుర స్కారం అయిన ‘భారతరత్న’బిరుదును ఇచ్చి గౌరవించింది. అపార మైన మానవ శక్తిని భారతదేశ సర్వతో ముఖ వికాసానికి వినియో గించాలన్న కర్మ యోగి సర్. మోక్షగుం డం విశ్వేశ్వరయ్య విశ్వ విఖ్యాతుడైన ఇంజనీర్, రాజనీతిజ్ఞుడు, పాలనాదక్షుడు, అయిన విశ్వేశ్వరయ్య వ్యక్తిత్వం నుంచి నేటి తరం నేర్చుకోవాల్సింది ఎంతైనా వుంది. వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా, ఆధునికంగా భారత దేశాన్ని పునర్నిర్మాణం చేయడంలో ఆయన నిర్వహించిన పాత్ర నిరూపమానమైనది, అద్భుతమైనది.