- అవిశ్వాస తీర్మానంపై ఎద్దేవా చేసిన ప్రధాని మోడీ..
- బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో దిశా నిర్దేశం..
- విపక్షాలకు ఒకరిపై ఒకరికి అపనమ్మకం ఉంది..
- వాళ్ళ పతనానికి వాళ్ళే రాత రాసుకుంటున్నారు..
- ప్రతి పక్షాల కూటమి ఇండియా కాదు.. ఘమండియా..
- తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని మోడీ..
లోక్‌సభలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఇండియాలోని పార్టీలకు విశ్వాస పరీక్షేనని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. 2024 జనరల్ ఎలక్షన్‌ల కంటే ముందే సెవిూఫైనల్ చూడాలని ప్రతిపక్షాల కూటమి కోరుకుందని అభిప్రాయపడ్డారు. ఆ సెమిఫైనల్ రిజల్ట్ ఎలా ఉందో అందరూ చూశారని అన్నారు. మంగళవారం ఉదయం బీజేపీ పార్లమెంట్ పార్టీ సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి మోదీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రానున్న సందర్భంగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక కామెంట్స్ చేశారు. ఈ భేటీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎంపీ జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీ సర్వీసెస్ బిల్లు, అవిశ్వాస తీర్మానంపై జరిగిన మాటల యద్ధం, జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ మోదీ ఈ కామెంట్స్ చేశారు. ఈ భేటీలో విపక్ష కూటమిపై ప్రధానమంత్రి మోదీ తీవ్ర విమర్శలు చేశారు. వాళ్లంతా ఒకరిపై ఒకరు అపనమ్మకంతో ఉన్నారని ఇదే వాళ్ల పతనానికి దారి తీస్తుందని జోస్యం చెప్పారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా మాట్లాడే వారి జాబితాను గుర్తు చేస్తూ వారంతా ఆఖరి బాల్‌కు సిక్స్ కొట్టాలను కుంటున్నారని ఎద్దేవా చేశారు. కూటమిలోని పార్టీలకు పరీక్ష పెట్టుకునేందుకే ఈ అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తీసుకొచ్చారని మోదీ ఎద్దేవా చేశారు. ఎవరి కూటమిలో ఉన్నారో ఎవరు లేరో ఈ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా తేల్చుకుంటారని విమర్శించారు. 2018లోనే వారిపై అవిశ్వాసం ప్రకటించామన్నారు మోదీ. కూటమిని మోదీ ’ఘమండియా’ అని మరోసారి పిలిచారు. హిందీలో ఘమండియా అంటే అహంకారం అని అర్థం. ఆ కూటమిలోని కొందరు నేతలు చాలా అహంకారంతో ఉన్నారని, వాళ్లంతా బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నియంత్రుత్వ పోకడలను ప్రోత్సహిస్తూ ఇండియా కూటమిలో ఉన్న వాళ్లు ఇప్పుడు సామాజిక న్యాయం కోసం మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏకైనా విపక్షాలు ఇండియాగా ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఆ కూటమిపై మోదీ ఎదురు దాడి చేస్తూనే ఉన్నారు. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌ను కొత్తగా బ్రాండింగ్ చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేస్తున్నారు. దేశాభివృద్ధికి ప్రతిపక్ష కూటమి ’అడ్డంకి’గా మారిందని ఇండియా అనేది అవినీతి, వారసత్వ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఇండియానుంచి కుటుంబ పాలనకు, అవినీతికి, అవకాశవాద రాజకీయాలకు ముక్తి లభించాలన్నారు. నిన్న రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీల కూటమికి సెవిూ ఫైనల్స్ అని .. సెవిూస్‌లోనే ఇండియా కూటమి ఓడిపోయిందన్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత ఇండియా కూటమి పక్షాలకు లేదని మోదీ అన్నారు. సామాజిక న్యాయానికి ఇండియా కూటమి పార్టీల వల్లే నష్టం జరిగిందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన సెవిూ ఫైనల్స్‌లో ఇండియా కూటమి పరాజయం పాలైందని మోదీ అన్నారు. 2024 ఓటింగ్‌కు ముందు సెమీ ఫైనల్ అని కొందరు అహంకారంతో అన్నారన్నారు. సెవిూఫైనల్‌లో విజయం సాధించినందుకు ఎన్డీఏ ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్ట్ 9 నుంచి బీజేపీ మరో క్విట్ ఇండియా నినాదం ప్రారంభమవుతుందన్నారు. ఆగస్టు 14న విభజన దినాన్ని జరుపుకుందామని మోదీ అన్నారు. స్వాతంత్య అమృత్ మహోత్సవ్ కార్యక్రమం పూర్తికాగానే ప్రతి గ్రామం నుంచి అమృత కలశ యాత్ర ప్రారంభమవుతుందన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే ప్రణాళిక ఇందులో ఉందన్నారు. ప్రతి ఇంటిని సందర్శించి, ఆ ఇంటి పెద్దకు ఈ ప్రణాళికను ఇవ్వాలన్నారు. ప్రతి గ్రామంలో 75 మొక్కలు నాటాలన్నారు. ఆ తర్వాత ఈ కార్యక్రమం తహసిల్, జిల్లా, రాష్ట్ర స్థాయిని దాటుకుని ఢిల్లీకి చేరుకుంటుందని మోదీ అన్నారు.