- షాద్ నగర్ నుండి భారీ కాన్వాయ్ తో బయలుదేరనున్న ముదిరాజ్ సోదరులు
- రేపు దాదాపు 500 మందితో 100 వాహనాలలో చేవెళ్ళేకు ప్రయాణం
- షాద్ నగర్ ముదిరాజ్ తాలూకా అధ్యక్షుడు అంచ రాములు ముదిరాజ్ పిలుపు
షాద్ నగర్ : తెలంగాణ రాబిన్ హుడ్ పండగ సాయన్న విగ్రహావిష్కరణ సెప్టెంబర్ 5వ తేదీన చేవెళ్ల పట్టణంలో ఆవిష్కరించనున్నట్లు తధానుగుణంగా షాద్నగర్ పట్టణం మరియు ఆరు మండలాలకు చెందిన ముదిరాజ్ ముద్దుబిడ్డలు తరలిరావాలని పిలుపునిచ్చారు షాద్నగర్ ముదిరాజ్ తాలూకా అధ్యక్షుడు అంచ రాములు ముదిరాజ్ కార్యక్రమంలో భాగంగా షాద్ నగర్ పెన్షనర్ ఆఫీస్ లో ముదిరాజ్ సోదరులతో నిర్వహించిన ఇష్టా గోష్టి లో అంచరాములు మాట్లాడుతూ పండుగల సాయన్న పేద ప్రజల కోసం తాను దొంగిలించిన సోత్తును పేదలకు పంచిపెట్టి వారి ఆకలిదపికలను తీర్చారన్నారు. ఆ మహానీయుని మార్గదర్శనంలో మనమంతా మంచి కోసం కృషి చేయాలని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 5వ తేదీన చేవెళ్ల పట్టణంలో నిర్వహించే పండుగ సాయన్న విగ్రహావిష్కరణకు షాద్నగర్ నియోజకవర్గం లోని ఆరు మండలాలకు చెందిన ముదిరాజ్ సోదరులు తరలివచ్చి విగ్రహ ఆవిష్కరణను విజయవంతం చేయాలని కోరారు చేవెళ్లలో జరగబోయే భారీ ర్యాలీకి షాద్నగర్ నియోజకవర్గం నుంచి దాదాపు 500 మందితో 100 వాహనాలలో షాద్నగర్ చౌరస్తా నుంచి ర్యాలీగా బయలుదేరి ఎలికట్ట చౌరస్తా మీదుగా చేవెళ్ల బయలుదేరడం జరుగుతుందని దయచేసి ఉదయం 9 గంటల వరకు అందరూ షాద్నగర్ చౌరస్తాకు తరలిరావాలని పిలుపునిచ్చారు షాద్నగర్ లో నిర్వహించిన పండుగ సాయన్న విగ్రహావిష్కరణను అందరు ఆదర్శంగా తీసుకొని ప్రతి నియోజకవర్గంలో విగ్రహాల ఏర్పాటు చేస్తున్నారని ఈమధ్య చూసినట్లయితే మహబూబ్నగర్, పరిగి, ఇప్పుడు చేవెళ్ల నియోజకవర్గం లో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఇలా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని ప్రతి ముదిరాజ్ ముద్దుబిడ్డలు పండగ సాయన్న విగ్రహావిష్కరణలో పాలుపంచుకోవాలని కోరారు