Tuesday, October 3, 2023

కర్ణాటకలో బీజేపీ హయాంలో దారుణ పరిస్థితులు

తప్పక చదవండి
  • తెలంగాణలో ముస్లింలు సేఫ్ గా ఉన్నారు: ఒవైసీ

ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముస్లింలు సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు. కర్ణాటకలో బీజేపీ అధికార పీఠంపై ఉన్నప్పుడు దారుణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. కర్ణాటకతో పోల్చితే తెలంగాణలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ సుపరిపాలనలో శాంతిభద్రతలకు లోటు లేదని, రాష్ట్రంలో ఎటువంటి దాడి ఘటనలు లేవని అన్నారు. ఇక, థర్డ్ ఫ్రంట్ కు కేసీఆర్ నాయకత్వం వహిస్తే బాగుంటుందని ఒవైసీ అభిప్రాయపడ్డారు. దేశంలో థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చేందుకు గట్టి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కేసీఆర్, మాయావతి ఏ కూటమిలో లేరని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ బండికి పంక్చర్ అయిందని, కాస్తో కూస్తో ఉన్న గాలిని ప్రజలు పూర్తిగా తీసేశారని ఒవైసీ వ్యంగ్యం ప్రదర్శించారు. దళితులు, ఓబీసీల రిజర్వేషన్లు పెంచాలంటున్న కాంగ్రెస్ పార్టీ… ముస్లిం రిజర్వేషన్లపైనా తన అభిప్రాయం చెబితే బాగుంటుందని ఒవైసీ పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు