Friday, April 19, 2024

కౌన్సిలర్ బావను అంటూ బరితెగింపు..

తప్పక చదవండి
  • పోచారం మున్సిపల్ లో అక్రమ కట్టడాలు..
  • నీకు ఇంత.. నాకు ఇంత అని పంచుకుంటున్న
    కొందరు అధికారులు అక్రమ నిర్మాణదారులు..

మేడ్చల్ మల్కాజిగిరి, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
పోచారం మున్సిపల్ పరిధిలో రోజు రోజుకూ అక్రమ నిర్మాణాల దందా పెరిగిపోతోంది.. కౌన్సిలర్ బావను అంటూ.. ఒక వ్యక్తి ఏకంగా 16 వార్డులో.. ఎలాంటి పర్మిషన్ లేకుండా భారీ బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణం చేస్తున్నాడు.. ఇంత జరుగుతున్నా కొందరు అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో మునిగి తేలుతూ అక్రమ నిర్మాణాల వైపు కన్నెత్తి చూడటం లేదు.. పోచారం మున్సిపల్ కమిషనర్ మాత్రం ; తనది సోమారం.. మందిది మంగళారం’ అనే రకంగా వ్యవహరించటం బాగలేదని స్థానికులు విమర్శిస్తున్నారు.. ఇకనైనా అధికారులు కండ్లు తెరుస్తారా..? అన్నది వేచి చూడాలి.. ఈ అక్రమ కట్టడాన్ని ప్రోత్సహిస్తున్న కౌన్సిలర్ బావ, తన మరదలు వార్డ్ లో.. ఎలాంటి నిర్మాణాలు చేయాలన్నా మొదటగా అతనిని కలవాల్సిందే.. ఎంతో కొంత కాకుండా.. కౌన్సిలర్ బావగారు అడిగినంత ఇవ్వకుంటే.. ఇగ అంతే సంగతి.. రంగంలోకి మున్సిపల్ కమిషనర్ టీమ్ జేసీబీతో దిగటం.. సెటిల్మెంట్ చేయడం పోచారం మున్సిపల్ లో ఒక ఆనవాయితీగా మారింది.. చూద్దాం అధికారులు మారేనా.. అభివృద్ధి జరిగేనా.. అన్నది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు