Sunday, July 21, 2024

నా బిడ్డను గెలిపించండి.

తప్పక చదవండి
  • ఇల్లందులో కేసీఆర్ సభ విజయవంతం..
  • ఇల్లందు ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ ప్రసంగిస్తూ..
  • నా బిడ్డ హరిప్రియను ఆశీర్వదించండి కేసీఆర్..

ఇల్లందు : ఇల్లందు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి హరిప్రియ నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ఇల్లందు లో కెసిఆర్ సభ విజయవంతంగా ముగిసింది.. ఇల్లందు నియోజకవర్గంలో ప్రజలు తండోప తండాలుగా కదీలీ వచ్చారు. సుమారు 70, వేల మంది ప్రజలతో సభా ప్రాంగణం కిటకిటలాడింది. కనీ విని ఎరగని రీతిలో ఇల్లందులో ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఈ ఎన్నికల సందర్భంగా మొట్టమొదటిసారి జరిగిన భారీ బహిరంగ సభ అని చెప్పవచ్చు. సందర్భంగా కెసిఆర్ సభలో పాల్గొని ప్రజలకు అభిన వాదం చేశారు. ప్రజలంతా కేసిఆర్ కు జై జై పలికారు. కెసిఆర్ రాకతో కార్యకర్తల్లో, యువకుల్లో, మహిళల్లో నూతన ఉత్సాహం పొంగిపొల్లింది. ఈలలు ,కేరింతలతో యువకులు కేసీఆర్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ… రాజకీయ పరిణితి ఈ దేశం లో రావాలి. మంచి చేదులను అలోచించి ఓటువస్తే నే ప్రజలు గెలుస్తారు. ఏ పార్టీ మంచి దో తెలుసుకోవాలి. ఓటు తమాషా కోసమే ఓటు వెయ్యవద్దు, ఓటు వేసే ముందు నిజమైన పందా ఉండాలన్నారు. బిఆర్ఎస్ పార్టీ అధికారం లో కి వచ్చాక ఎన్నికల హామీల కంటే ఎక్కువ అభివృద్ధిని సాధించిపెట్టామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం చేయలేని24 గంటల కరెంట్ ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు. బీజేపీ ప్రభుత్వం కు ప్రైవేటీకరణ పిచ్చి పట్టిందని అందుకే దేశంలోని ప్రాధాన్యతగల పరిష్ఠములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు కుటిలియత్నం చేసిందన్నారు. రైతు వ్యసాయ మోటార్లకు కరెంట్ మీటర్ పట్టమంటే నా తలకాయ పోయిన మీటర్ పట్టానాన్నా ఆని వివరించారు. వ్యవసాయ స్థిరకరణ లో భాగంగా న్నే రైతు బందు, వ్యసాయం భీమ్స్, ధరణిపోర్టల్, లాంటి పథకాలు అమలి చేశామన్నారు.

ఎమ్మెల్యే హరిప్రియనాయక్ ఇల్లందుచరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి పనులు సాధించిపెట్టిందని ఆమెను కొనియాడారు. పొడు భూములకు పెట్టాలిచి, రైతు బంధు ఇచ్చామన్నారు. హరిప్రియ నా బిడ్డ లాంటిది, హరిప్రియా కోరిక మేరకు కొమరారం, బోడు మండలం గా, ఇల్లందు ను రెవిన్యూగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ జిల్లాలో డబ్బు హంకారం తో ఉండి బిఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ 3గంటల కరెంట్ చాలంటున్నారనడంలో వారికి రైతుల పాలిట ఎలాంటి ప్రేమ ఉందో అర్థమవుతుందని అన్నారు.. రాష్టం లో వర్షాలు అధికంగా కురిసి 3 కోట్ల ధాన్యం పండుతుందన్నారు. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం లో ప్రజలకు సన్నబియ్యం ఇస్తామని తెలిపారు. గ్యాస్ సిలందర్ 400 రూపాయలకే మన్నారు.సాధారణ మరణానికి ,5లక్షల బీమా అమలు కామన్నారు. విద్యా పరంగా అనేక కళాశాలల ఏర్పాటు చేస్తామన్నారు.త్వరలోనే సీతా రామ ప్రాజెక్టు పూర్తి కాబోతుంది. అన్నారు బిఆర్ఎస్ కు ప్రజలే బాసులు. మాకు పైన బాసులు ఉన్నారు. ఒకరోజు ఈ ప్రాంతం వచ్చి మీ సమస్యలు పరిస్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు నామ నాగేశ్వరరావు,కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర్లు, రేగా కాంతారావు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి, మాజీ ఎమ్మెల్సీలు పూల రవీందర్ ,బి వెంకట్రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగల్ రాజేందర్, మహుబాద్ జడ్పీ చైర్మన్ అంగ్కోత్ బిందు, జడ్పీ వైస్ చైర్మన్ కంజర్ల చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ జానీ పాషా. తదితర ప్రజా ప్రతినిధులు ఎంపీటీసీలు సర్పంచులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు