Friday, July 26, 2024

పురుగుల సాంబార్ తో ఇడ్లీ వడ్డన..

తప్పక చదవండి
  • రాయగిరి హోటల్ దీప్తిలో వెలుగు చూసిన ఘటన..
  • కస్టమర్లకు క్షమాపణలు చెప్పిన హోటల్ యజమాని..
  • ప్రజల ఆరోగ్యాలతో ఆదుకోవడం ఏంటంటున్న బాధితుడు సంతోష్..
  • ఫుడ్ సేఫ్టీ అధికారులు దృష్టి పెట్టాలంటున్న స్థానికులు..

హైదరాబాద్ : బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ సాంబార్ కి ప్రముఖ స్థానం ఉంది.. అల్పాహార విందులో ఎంతో మంది ఇడ్లీ సాంబార్ ని ఇష్టపడతారు.. ఇంట్లో చేసిన అల్పాహారం కంటే చాలా మంది హోటల్ లో ఆహార పదార్ధాలను ఇష్టంగా తింటారు.. రుచిగా శుచిగా వడ్డిస్తారని నమ్ముతారు.. ఓ నలుగురు స్నేహితులు కలిస్తే హోటల్ కి వెళ్లడం రివాజు.. కానీ ఎలాంటి శుచి, శుభ్రత పాటించని కొన్ని హోటళ్లు కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్నారు.. డబ్బుకు డబ్బు, ఆరోగ్యానికి ఆరోగ్యం చెడగొట్టుకుంటూ ఇదే ఖర్మరా బాబూ అంటూ వాపోవడం వారి వంతు అవుతోంది.. టీ, కాఫీల్లో.. కూరల్లో, చివరికి భోజనాల్లో సైతం పురుగులు, బొద్దింకలు వచ్చిన సందర్భాలు అనేకం చూశాం.. అధికారులు ఇలాంటి సంఘటనల్లో హోటళ్లను సీజ్ చేసిన ఘటనలు కూడా చూశాం.. కానీ హోటల్స్ నిర్వహించే యజమానుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు.. ఎలాంటి ప్రామాణికాలు పాటించకుండా.. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.. దీనికి తోడు కొందరు సంబంధిత ప్రభుత్వ ఉద్యోగులు సైతం హోటల్ యాజమాన్యాలు అందించే లంచాలను తీసుకుంటూ.. తమకేమీ పట్టనట్లు ఉంటూ.. ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారు.. ఇలాంటి సంఘటనే యాదాద్రి భువనగిరి జిల్లా, రాయగిరిలో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే..

సంతోష్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఇడ్లీ సాంబార్ ఆరగిద్దామని.. హోటల్ దీప్తికి వెళ్లి ఆర్డర్ చేశారు.. వేడి వేడిగా పొగలు కక్కుతున్న సాంబార్ ఇడ్లీ సర్వ్ కాగానే ఎంతో ఆతృతగా తినడానికి ప్రయత్నం చేయగా.. సాంబార్ లో పురుగు కనిపించింది.. దాంతో ఖంగు తిన్న వారు హోటల్ యజమాని అయిన మల్లారెడ్డి ని పిలిపించి విషయాన్ని వివరించారు.. దీనికి స్పందించిన మల్లారెడ్డి జరిగిన తప్పును ఒప్పుకుని సంతోష్ అతని స్నేహితులకు క్షమాపణలు చెప్పి, మరోసారి ఇలాంటి సంఘటనలు జరక్కుండా జాగ్రత్త పడతామని తెలిపారు.. ఇంత వరకు బాగానే ఉంది.. కానీ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయా..?అంటే సమాధానం దొరకడం మృగ్యమే.. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు కళ్ళు తెరిచి, లంచాలకు తలొంచకుండా.. ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని హోటళ్ల నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకుని.. తీసుకుంటున్న జీతానికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు