- అని హామీ ఇచ్చిన మంత్రి తలసాని
హైదరాబాద్ : ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా గణేష్ నిమజ్జనాలకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పీవీ మార్గ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలిసి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హైదరాబాద్‌లో నిర్వహించే గణేష్ ఉత్సవాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.
ఈ సంవత్సరం సుమారు 90 వేల వరకు విగ్రహాలు ఉంటాయన్నారు. మూడో రోజు నుంచే విగ్రహాల నిమజ్జనం ప్రారంభం అవుతుందని చెప్పారు. విగ్రహాల నిమజ్జనం కోసం పాండ్స్‌ను ఏర్పాటు చేశామని, శోభాయాత్ర మార్గాలలో నిమజ్జనం జరిగే ప్రాంతాలలో పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.