Wednesday, September 11, 2024
spot_img

మహమ్మద్‌ అజారుద్దీన్‌పై నాలుగు కేసులు

తప్పక చదవండి

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ నేత మహమ్మద్‌ అజారుద్దీన్‌పై నాలుగు కేసులు నమోదయ్యాయి. హెచ్‌సీఏ లో భారీ అవినీతి జరిగిందని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో రాచకొండ పోలీసులు అజారుద్దీన్‌పై నాలుగు కేసులు నమోదు చేశారు. మరోవైపు తనపై నమోదైన నాలుగు కేసుల్లో బెయిల్‌ కోసం మల్కాజ్‌గిరి కోర్టును ఆయన ఆశ్రయించారు.హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉప్పల్‌ స్టేడియంలో వివిధ సామగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్‌ మాల్‌ జరిగిందని అజారుద్దీన్‌పై ఆరోపణలు వచ్చాయి. హెచ్‌సీఏలో కోట్ల రూపాయల నిధులు గోల్‌మాల్‌ చేశారని.. టెండర్ల పేరుతో థర్డ్‌ పార్టీకి నిధులు కట్టబెట్టారని అజారుద్దీన్‌పై కేసు నమోదు అయింది. అగ్నిమాపక పరికరాలు, క్రికెట్‌ బంతులు, బకెట్‌ కుర్చీలు, జిమ్‌ సామాగ్రితో సహా అనేక పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు తేలడంతో రాచకొండ పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు నవంబర్‌ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అజారుద్దీన్‌ సిద్ధమైన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు