Tuesday, October 3, 2023

పర్యావరణ మార్పులు – భారత్‌ ఆహార భద్రతకు ముప్పు

తప్పక చదవండి

మనకు మనం, కోరి తెచ్చుకున్న జీవన నడవడిక మన చుట్టూ వున్న పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తుంది.భవిష్యత్తులో మనం తినే ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు,ఆకు కూరలకు కరువు రానుంది. ఈ విషయంలో ఇప్పటికే మన కండ్ల ముందు కనపడుతున్న పర్యావరణ అసమతుల్యత మన పంటల దిగుబడులను గణనీయింగా తగ్గించి వేసింది.ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు,వినియోగదారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రానున్న రోజుల్లో ఆహార భద్రతకు పెను ముప్పు రానుందని మన పార్ల మెంటరీ స్థాయి సంఘం ఆరేళ్ల క్రితమే ప్రభుత్వానికి హెచ్చరిక కూడా జారీ చేసింది. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో హెచ్చుతగ్గుల అసమతుల్యత మన దేశంలో కరువు కు ఆహ్వానం పలకనుంది.మనం పర్యావరణ పరి స్తులను పట్టిం చుకోకుండా నిర్లక్ష్యంగావ్యవహరిస్తే,లేదాఎప్పటికప్పుడు సమస్యను వాయిదా వేస్తూపోతే, భవిష్యత్తు అంధకారంగా మిగులుతుంది. దీని మూలంగా రానున్న భవిష్యత్‌ తరాలు తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా, ప్రపంచంలోనే 140 కోట్ల అధిక జనభాగల భారతదేశం ఆహార కొరతతో అలమటించే పరిస్థి తులు రానున్నాయి. ఈ పరిస్థితులను ఊహిస్తూ, భారత వ్యవసా య పరిశోధన మండలి, సంబంధిత శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరికలు జారీచేశారు. ముఖ్యంగా ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ భారత వ్యవసాయ పరిశోధన విద్యా విభాగం కార్యదర్శి డాక్టర్‌ హిమాన్షు పాఠక్‌ తాజాగా గణాంక వివరాలతో నివేదికను ప్రభు త్వానికి అందజేశాడు. వాతావరణం లో ఊహాతీత పరివర్తనల మూలంగా 2080 నాటికి, ముఖ్యంగా వర్షాధార పంటలైన వరి, గోధుమ,చెరకు దిగుబడిలో ఏకంగా 40 నుంచి 45% తరుగుదల నమోదు కానునట్లు డాక్టర్‌ పాటక్‌ తన ఆం దోళన వ్యక్తం చేశాడు. మొక్కజొన్న, సోయాబీన్‌ తదితర పంటలు కూడా సంక్షో భాన్ని ఎదుర్కోనున్నాయి.కేవలం పంటల దిగుబడులు తగ్గి పోవట మే కాకుండా, పండిన పంటల్లో పోషక విలువల నాణ్యత కూడా పర్యావరణ మార్పుల మూలంగా క్రమంగా క్షీణి స్తున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా 109 జిల్లాల్లో వ్యవ సాయం అత్యంత తీవ్రస్థాయి సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందని అంచనా వేశారు.దీని తీవ్రత మునుముందు 201 జిల్లాలకు విస్తరించే ము ప్పు కూడా కనపడుతుందని నిపుణుల సంఘం అంచనా వేసింది. మన దేశం లో స్థానికంగా సుమారు 60 శాతం సాగు భూలు వర్షా ధారాల పై ఆధారపడినవే.ఆయా ప్రాంతాల్లో పంట ల దిగు బడి తగ్గిపోతే భారత గ్రామీణార్ధిక వ్యవస్థ అతలాకుతలం అవు తుంది. దేశ వ్యాప్తంగా ఆహార భద్రత లోపిస్తుంది.దానిని నివారించాలంటే
కేంధ్ర-రాష్ట్ర,స్థానిక ప్రభుత్వాలకు కొన్ని సూచనలు: ప్రకృతి వైపరీత్యాలతో వ్యవసాయ రంగంపై ఆధార పడిన చిన్నకారు, సన్నకారు రైతుల సంక్షేమాన్ని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించు కోవాలి.వారికి తగిన నిధులు కేటాయించాలి. భూసారాన్నీ పరిరక్షించే చర్యలు చేపట్టాలి.కఠిన శీతోష్ణస్థితుల్లోనూ మంచి దిగుబడులను ఇచ్చే వివిధ రకాల వంగడాలను ఇక్రిషాట్‌ వంటి వ్యవసాయ పరిశోధనా సంస్థల సహకారంతో అభివృద్ధిపరచాలి. వాటిని చౌకగా సబ్సీడీలపై రైతులకు అంధించాలి. వాటిని విస్తృత వినియోగంలోకి తీసుకురావాలి. పంట నిల్వ వసతులను, గిడ్డంగులను నిర్మించాలి.కోల్డ్‌ స్టోరేజీలను సమకూర్చాలి. సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలి. పుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలను నెలకొల్పాలి. పంటల భీమాను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయాలి. రసాయిన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని గణనీయంగా తగ్గించేందుకు రైతు చైతన్య సదస్సులు ఏర్పాటు చేయాలి. పంటల రక్షణకు వ్యవసాయ అధికారులతో, శాస్త్రవేత్తలతో ఫోను ద్వారా, ఆన్‌ లైన్‌ ద్వారా రైతులు సంప్రధించే అవకాలు మెరుగుపర్చాలి. గిట్టుబాటు ధరలకు ప్రభుత్వంపూను కోవాలి. రైతులు తమ పంటలను జాతీయంగా, అంతర్జాతీయంగా ఎగుమతులు చేసుకొనే వెసులుబాటు వుండాలి.లాభాలు ఆర్జించే పంటలను వేసేలా తగిన సూచనలు,సలహాలను వ్యవసాయ విశ్వవిద్యాలయల ద్వారా అంధించాలి. అన్నింటికన్నా ముందు ప్రాణాంతక కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలి. దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.దీని కారణంగానే 2021లో దేశీయ తయారీ,సేవ, వ్యవసాయ, నిర్మాణ రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. సుమారు 15,900 కోట్ల డాలర్లను (జిడిపిలో దాదాపు 5.4 శాతం) నష్టపోయినట్లు ఇటీవల ఒక అధ్యయనం లెక్కగట్టింది. తుఫానులు ఆకస్మిక వరదలు,కొండ చర్యలు కూలిపడటం వంటి వంటి సంఘటనల వల్ల 2015- 2022 మధ్య ఇండియాలో 8.89 కోట్ల ఎకరాల్లో పంటలు పాడైనట్టు అంచనా వేశారు. అలాగే, గడిచిన మూడు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా వర్షపాతం తీరుతెన్నులు పూర్తిగగా మారిపోయాయి. వరదలూ, తుఫానులూ విధ్వంస కరంగా పరిణమిస్తున్నాయి. రుతుపవనాలు గతి తప్పుతున్నాయి.దానితో కరువు పరిస్థితుసు ఏర్పడుతున్నాయి. సుమారు ఏడున్నర వేల కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం, అత్యధిక జనసాంద్రత వల్ల ప్రకృతి వైపరిత్యాల ప్రతికూల ప్రభావానికి భారతదేశం గురికానునట్లు ఐక్యరాజ్య సమితి అంతర్‌ ప్రభుత్వాల కమిటీ నివేదికలో వెల్లడిరచింది. భూమి ఊష్ణోగ్రత పెరగటాని ముఖ్యకారణం శిలాజ ఇంధనాలు మండిరచటమే. అధిక రసాయన ఎరువులు, పురుగుమందులు భూగర్భాన్ని విషపూరితం చేస్తున్నాయి. తీర ప్రాంత ఫ్యాక్టరీల రసా నిక వ్యర్ధాలు నీటిని కలుషితం చేస్తున్నాయి. ప్రణాళికా రహితంగా విస్తరిస్తున్న పట్టణాలు,అడవుల నరికివేతలతో పరిస్థితులను మరింత దిగజార్చుతున్నాయి. ‘సత్వర అభివృద్ధి కోసం చేపట్టే కార్యకలాపాల వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ఈ విషయంలో భారత సర్వోన్నత న్యాయస్థానం గత జనవరి నెలలో పలు సూచనలు చేసింది. సుస్థిరాభివృద్ధికి ప్రకృతి పరిరక్షణ మధ్య సంఘర్షణ, వైరుధ్యం ఎప్పుడూ ఉంటుంది. అయితే వీటిమధ్య హేతుబద్ధమైన సమతుల్యతను సాధించడమే విజ్ఞుల పని అని, హితవు పలికింది. ఆ మేరకు పాలకుల జాగర్తలు వహించాలి. దీనితో పాటు-2070 కల్లా ‘నెట్‌ జీరో’ (కార్బన్‌ ఉద్గారాల తటస్థత)ను సాధిస్తామని అంతర్జాతీయ సమాజానికి చేసిన వాగ్దానం నిలబెట్టు కోవాలి. అందుకుగాను దీర్ఘకాలిక వ్యూహా లతో ప్రణాళికల రూపకల్పన జరగాలి. పెట్రోల్‌,డిజీల్‌ మొదలైన ఇంధనాలు పొదుపుగా వాడాలి. ప్రజా రవాణాలో పర్యావరణ హితమైన సోలార్‌ ఎనర్జీని విరివిగా వాడాలి. ఇతర నూతన మార్గాల ను అన్వేషించాలి. పట్టణాల విస్థరణ వల్ల కలిగే పర్యావరణ సమస్యలను ప్రణాళికా బద్ధంగా ఎదుర్కోవాలి. పరిశ్రామిక వ్యర్ధాలు జలవనరులను నాశనం కాకుండా చూడాలి,అటవులను రక్షించటంతో పాటు జనాభా నిష్పత్తికి తగినట్లు 33 శాతం అడవులను పెంచాలి. విస్తారంగా పట్టణాలు, పల్లెలు, రహదారులు,ఖాళీ మైదానాలలో మొక్కలు నాటాలి. మనచుట్టూవున్న పరిసరాలలో శుభ్రమైన గాలి,స్వచ్ఛమైన నీరు లభించేలా కేంద్ర-రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు పర్యావరణ హితమైన చర్యలను చేపట్టాలి. మరొకవైపు ప్రపంచ వనరులను అందరికంటే ఎక్కువగా కొల్లగొట్టేది, పర్యావరణానికి ఎక్కవ ముప్పు తెచ్చేది,పారిశ్రామికంగా బాగ అభివృద్ధి చెందిన పాశ్చాత్యలే దీనికి కారణం. కానీ అవి కేవలం ప్రపంచానికి నీతులు బాగా చెబుతాయి. బాధ్యత మాత్రం తీసుకోవు.నిధులు కూడా సరిగ్గా విడుదల చేయవు. అమెరికాకు కోపం వచ్చినప్పుడు తన వాట నిధులను నిధులను నిలుపదలచేస్తుంది. నిజానికి పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన దేశాలే ప్రపంచ పర్యావరణ పరిరక్షణ బాధ్యతలు చేపట్టాలి. ఈదేశాలే – కర్భన ఉద్గారాలను విచ్చలవిడిగా వెదజల్లుతున్నాయి.’
ఇ- వేస్ట్‌’ ను ఆసియా,ఆఫ్రికా,ల్యాటిన్‌ అమెరికా దేశాలకు షిప్పులలో తరలిస్తుంది.పైగా ‘క్యాప్‌’ విశ్వసదస్సులో అవి చేసే ప్రతిజ్ఞలు, వాగ్ధానాలు నీటిపై రాతలే అవుతున్నాయి. భూతాపాన్ని తగ్గించటం లో సంపన్న రాజ్యాలు నిజంగా సహకారం,సహాయం అందించి నప్పుడే వాతావరణ మార్పుల విషవలయం లోంచి,మానవాళి తెప్పరిల్ల గలుగుతుంది. ధనిక దేశాలు ప్రపంచ ఆధిపత్యంకోసం చేసే యుద్ధాలు, ఆయిధ కాలుష్యం,అవి చేసే జీవశాస్త్ర పరిశోధనలు కూడా ప్రపంచ పర్యావరణానికి ముప్పు తెస్తున్నాయి. ఈ విషయంలో బడుగు దేశాలు ఐక్యరాజ్యసభలో తమ గోడు వెళ్ళబోసుకుందామంటే వినే నాధుడు లేడు. ఐక్యరాజ్య సమితిలో కూడా అమెరికా,రష్యా,చైనా,ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌, వంటి అగ్ర రాజ్యాల పెత్తనం కొనసాగుతుంది. ఈఅగ్ర రాజ్యాల సహ కారం, పట్టుదల లేకుండా ప్రపంచ దేశాల పర్యావరణ సమస్యలు పరిష్కారం కావు. ప్రపంచ వ్యాప్తంగా పౌరుల చైతన్యం, రైతుల ఉద్యమాలు,పర్యావరణ వేత్తలు మొదలైన వారి చైతన్యం, కృషి, వారి ప్రభావంతో ఈ సమస్యలను క్రమంగా అధిగమించగలం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు