Sunday, September 15, 2024
spot_img

ఫీల్ గుడ్ మూవీ ‘ఏందిరా ఈ పంచాయితీ’

తప్పక చదవండి
  • అక్టోబర్ 6 న థియేటర్లలోకి

హైదరాబాద్ : గ్రామీణ నేపథ్యంలో వస్తోన్న సినిమాలు, సహజత్వమైన కథలతో తెరకెక్కుతున్న చిత్రాలు జనాల ఆదరణను దక్కించుకుంటున్నాయి. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి. ఈ కోవలోనే ‘ఏందిరా ఈ పంచాయితీ’ అంటూ ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తీసిన అందమైన ప్రేమ కథా చిత్రం రాబోతోంది. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు ఈ చిత్రంతో హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇది వరకు ఈ చిత్రం నుంచి విడుదలు చేసిన టైటిల్ లోగో, గ్లింప్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా విడుదల చేసిన టీజర్ సైతం అందరినీ ఆకట్టుకుంది. సునీత పాడిన పాట అయితే అందరినీ కదిలించింది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ మీద వచ్చిన ఆ పాట అందరినీ మెప్పించింది. ఇలా ప్రతీ విషయంలో సినిమా మీద ఆసక్తిని పెంచేలా ప్రమోషన్స్ చేసింది యూనిట్.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదిని ప్రకటించారు. అక్టోబర్ 6న ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌గా, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల ఈ చిత్రానికి మాటలు అందించారు. కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు