Wednesday, September 11, 2024
spot_img

నేపాల్‌ లో మరోసారి భూకంపం..

తప్పక చదవండి
  • రిక్టర్‌ స్కేల్‌పై 4.1గా తీవ్రత నమోదు..
  • వరుస భూకంపాలతో వణకి పోతున్న నేపాల్..
  • తీవ్ర భయాందోళనలకు గురౌతున్న పౌరులు..

న్యూ ఢిల్లీ : భారత్ కు పొరుగు దేశమైన నేపాల్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా మంగళవారం ఉదయం మరోసారి అక్కడ భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 4:17 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.1గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది.. నేపాల్‌ రాజధాని ఖాట్మండుకు సవిూపంలో భూమికి 10 కిలోవిూటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. మరోవైపు వరుస భూకంపాలతో నేపాల్‌ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఎలాంటి సమాచారం లేదు. కాగా, ఈ నెల తొలి వారంలో కూడా నేపాల్‌ను వరుస భూకంపాలు గడగడలాడిరచాయి. కేవలం అరగంట వ్యవధిలో ఐదుసార్లు భూమి కంపించింది. ఆ తర్వాత కూడా పలుసార్లు స్వల్ప స్థాయిలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆదివారం కూడా అక్కడ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 6.1గా నమోదైంది. రాజధాని ఖాట్మండుకు పశ్చిమాన 55 కిలోవిూటర్ల దూరంలో ఉన్న ధాడింగ్ లో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు అధికారులు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు