Wednesday, July 24, 2024

జనాలు చస్తేగాని స్పందించరా…?

తప్పక చదవండి
  • ఏళ్ల కిందటే ఓపెన్ నాలాను కబ్జా చేశా..
  • ఇప్పుడు ప్రశ్నిస్తే ఎలా అంటున్న బడా బిల్డర్
  • బహరంగ వ్యాఖ్యలు చేస్తూ.. పరోక్షంగా ఒప్పేసుకున్న వైనం
  • చందానగర్ జీహెచ్ఎంసీ అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని కబ్జా
  • ఓపెన్ నాలాపై రోడ్డు నిర్మాణానికి లక్షల్లో చేతులు మారిన వైనం
  • ఇతర పార్టీల నాయకులకు సైతం భారీగా అందిన ముడుపులు
  • పూర్తిస్థాయిలో సహకరించిన శేరిలింగంపల్లి మున్సిపల్ యంత్రాంగం
  • ఫిర్యాదులపై చీమకుట్టనట్లుగా వ్యవహరిస్తున్న జీహెచ్ఎంసీ
  • నేటికి విచారణ చేపట్టని సర్కిల్ 21 డిప్యూటీ కమిషనర్

ఇచ్చుకో.. నచ్చినచోట ఆక్రమించుకో అన్నట్లగా తయారైంది శేరిలింగంపల్లి మున్సిపల్ అధికారుల పరిస్థితి. బడా బిల్డర్లు ఇచ్చే లంచాలతో.. ఓపెన్ నాలాల కబ్జాలపై ఏమాత్రం చర్యలు తీసుకోకుండా మన్నుగున్నల వలే వ్యవహరిస్తున్నారు. ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఓపెన్ నాలాను కబ్జా చేసి, దానిని అండర్ గ్రౌండ్ డ్రైనేజీగా మార్చి, దానిపై రోడ్డు నిర్మాణం చేయడంలో బిల్డర్ నుంచి జీహెచ్ఎంసీ జోనల్, సర్కిల్ అధికారులు లక్షల్లో దండుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకేనేమో కావాల్సినంత తీసుకున్నాం కదా.. కపాడిల్సిందే అన్నట్లుగా ..బిల్డర్ పై శేరిలింగంపల్లి అధికారులు ప్రేమ చూపిస్తున్నారు.

హైదరాబాద్ : ఏ చిన్న కబ్జా జరిగినా సరే, నానా యాగి చేసే వివిధ పార్టీల లీడర్లు సైతం ఓపెన్ నాలా కబ్జాపై నోరు తెరవడం లేదు. వారికి కూడా కావాల్సినంతగా ముట్టడంతోనే చందానగర్ లోని గౌతమినగర్ నాలా కబ్జాపై మాటలు రావడం లేదన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఫలితంగా బడా బిల్డర్, మున్సిపల్ అధికారులు ఇద్దరూ కలిసి, ప్రజలకు ఉపయోగపడే, ఓపెన్ నాలా కబ్జాకు గురై, గౌతమి నగర్ చుట్టు పక్కల స్థానికులను ప్రమాదంలో పడేలా చేసేసారు.

- Advertisement -

ఏళ్ల కిందటే కబ్జా చేసానంటూ ఒఫ్పేసుకుంటున్న బిల్డర్..:
శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ పరిధిలోని చందానగర్ పోలీసు స్టేషన్ కు సమీపంలో గౌతమినగర్ ప్రాంతంలో ఓపెన్ నాలా కబ్జా వ్యవహారంపై ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘ వరుస కథనాలను ప్రచురిస్తుంది. ప్రజా ప్రతినిధులను, జీహెచ్ఎంసీ అధికారులను దగ్గరగా చేసుకుని ఓ బిల్డర్ ఏకంగా ఓపెన్ నాలాపై రోడ్డును నిర్మించుకున్నారు. ఇది పూర్తిగా కబ్జా. అంతేకాకుండా జీహెచ్ఎంసీ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతివ్వదు. కానీ ప్రశ్నించేవారిని నోళ్లు మూయించేలా డబ్బులు ముట్టచెబుతూ, దాదాపు వంద మీటర్ల రోడ్డును ఓపెన్ నాలాపై నిర్మించారు. ఫలితంగా వర్షాలు వస్తే, అక్కడి చుట్టుపక్కలా ప్రాంతాల ఇళ్లు నీటమునిగేలా, ప్రస్తుత పరిస్థితి తయారైంది. మరోవైపు ఇది ఇప్పటి సమస్య కాదని, ఏళ్ల కిందటే నాలా కబ్జా జరిగిందని, రోడ్డు వేసుకున్నాని, ఇప్పుడు కొత్తగా వార్తలు రాయడం ఏంటని బిల్డర్ తనకు తానే ప్రచారం చేసుకోవడం హాట్ టాఫిక్ గా మారుతుంది. ఇంత యథచ్చేగా ఓపెన్ నాలాల కబ్జా జరుగుతున్నా.. చర్యలు తీసుకోవాల్సిన మంత్ర కేటీఆర్ చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

విచారణ చేపట్టని డిప్యూటీ కమిషనర్..?
పేదోడు గజం స్థలం కబ్జా చేస్తే, నిమిషాల్లో వాలిపోయే జీహెచ్ఎంసీ అధికారులు, బడా బిల్డర్ల కబ్జాలపై మాత్రం ముందుకు రావడం లేదు. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా సరే, తమకెందుకు లే అన్నట్లుగా చందానగర్ డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులు విచారణ చేపట్టడం లేదు. పైగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తమకు అత్యంత సన్నిహితుడని ప్రచారం చేసుకుంటూ, ఎవరూ తమను ప్రశ్నించకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి అధికారులను మచ్చిగ చేసుకుని బడా బిల్డర్లు ప్రభుత్వ ఆస్థులను కబ్జా చేస్తున్నారు. ప్రజలకు ఎంతో నష్టం కలిగించే వ్యవహరంపై తక్షణమే స్పందించాల్సిన అధికారులు, నేటికి ముందుకు రాకపోవడం వెనుకు ఎన్ని లక్షలు చేతులు మారాయోనని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆస్థి గా చెప్పుకునే ఓపెన్ నాలాలు యథచ్చేగా కబ్జాకు గురైతే, చర్యలు తీసుకోరా అంటూ చందానగర్ గౌతిమినగర్ వాసులు ప్రశ్నిస్తున్నారు. మియాపూర్ నుంచి బాచుపల్లికి వెళ్లే మార్గంలో నిర్మాణం సాగిస్తున్న ఓ బడా బిల్డర్, ప్రజల ఆస్థిని ద్వంసం చేసి, భవిష్యత్తులోనూ ఇబ్బందులకు గురిచేసేలా కబ్జా చేసారు.

అందరికి ముట్టిన ముడుపులు..
ప్రజలకు ఉపయోగపడేలా నిర్మించిన ఓపెన్ నాలాను ఆక్రమించి, ఆ నాలాను అండర్ గ్రౌండ్ డ్రైనేజీగా మార్చి, దానిపై రోడ్డు నిర్మించిన వ్యవహరం వెనుక ప్రజా ప్రతినిధులకు , జీహెచ్ ఎంసీ అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి చక్రం తిప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒక్కొక్కరికి లక్షల్లో చెల్లించి, ఓ బిల్డర్ తన ప్లాట్ కు రోడ్డును నిర్మించుకున్నాడు. ఇంత జరుగుతున్నా, ఎవరూ నాలా కబ్జాను అడ్డుకోలేని పరిస్థితి. ఇప్పటికైనా నాలాను ఓపెన్ నాలాగా మార్చకుంటే , రానున్న వర్షకాలంలో 2020 లో నగరంలో ఏర్పడిన లోతట్టు ప్రాంతాల జలమయమై, చందానగర్ గౌతమినగర్ నీట మునిగే ప్రమాదం ఉందని అక్కడి స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికైనా స్పందించి చందానగర్ గౌతమి నగర్ వాసులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు