Monday, December 4, 2023

శ్రీశైలం మల్లన్నకు పోటెత్తిన భక్తులు

తప్పక చదవండి

శ్రీశైలం : శ్రీశైలం మల్లన్న ఆలయం కార్తీక మాసం శోభను సంతరించుకుంది. మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో మల్లన్న సన్నిధికి తరలివచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, స్నానఘాట్లు, ఆలయం ఎదుట గంగాధర మండపం, ఆలయ ఉత్తర మాఢవీధుల్లో కార్తిక దీపారాధన చేశారు. ఇక రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రం వేములవాడకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయం ఆవరణలో కార్తిక దీపాలు వెలిగించారు. అదేవిధంగా నగరంలోని శివాలయాల్లో భక్తులు కార్తిక దీపారాధన చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు