Wednesday, September 11, 2024
spot_img

కాంగ్రెస్ గెలుపు.. తెలంగాణ అభివృద్ధికి మలుపు

తప్పక చదవండి

హైదరాబాద్ : తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో సామాజిక ఉద్యమ కారులు గండమల్ల వినోద్ రావు తెలంగాణా స్టూడెంట్ ఫెడరేషన్ (టి.ఎస్.ఎఫ్) రాష్ట్ర అద్యక్షులు జంపాల రాజేష్, సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పులిగిల్ల వీరమల్లు యాదవ్, సమాచార పౌర సంబంధాల శాఖ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ రంగసాయి బట్, జేఏసీ నాయకులు సోమశేఖర్, సతీష్, భుషన్, రాంబాబు, శ్రీను, నరేష్, సంపత్, వీరేందర్, రఘు, సైదులు, గౌతమ్, మహేష్, భరత్, నరేష్ రెడ్డి ఓయూ పూర్వ, ప్రస్తుత విద్యార్థులు 100 మంది సోమవారం నాడు రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే ఉద్యోగ ఖాళీలు అన్నింటినీ భర్తీ చేస్తామని, ముందే జాబ్ క్యాలెండర్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ విధానాలు అందరినీ ఆకర్షితులను చేస్తున్నాయని వినోదరావు అన్నారు. నిరుద్యోగ భృతి, యూనివర్సిటీల ఖాళీలు భర్తీ చేయాలని రేవంత్ రెడ్డిని అడగడం జరిగిందని, దానికి వారు సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పూర్వ, ప్రస్తుత విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ నీ అధికారంలోకి తీసుకు రావడానికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ప్రతి కుటుంబానికి 200 యూనిట్ ల కరెంట్, ఉద్యమ కారులకు 250 గజాల ఇంటి స్థలం, విద్యార్థులకు 5 లక్షల బరోసా కార్డ్, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్, చేయూత పెన్షన్, ధరణి స్ధానం లో భూమాత పోర్టల్, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 2500 పెన్షన్,500 కే గ్యాస్ సిలిండర్,ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, దివ్యాంగులకు 6,000 పెన్షన్,100 కోట్లతో జర్నలిస్టుల నిధి, ప్రతి ఆటో డ్రైవర్ కు రూ. 12000 ఏడాదికి సహాయం, సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్, తొలి క్యాబినేట్ లో జాబ్ క్యాలెండర్, కొత్త రేషన్ కార్డులు వీటిని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ని గెలిపించు కోవడం కోసం తెలంగాణా సమాజం భాద్యతగా భావించి తామంతా కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగిందని గండమల్ల వినోద్ రావు పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు