Tuesday, October 3, 2023

ముగిసిన జీ20 సమావేశాలు

తప్పక చదవండి

భారతదేశ అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సు విజయవంతంమైంది. ఈ సదస్సు అనేక విధాలుగా చారిత్రత్మకమైనదిగా నిలిచింది. వసుదైక కుటుంబం.. ఒకే భూమి.. ఒకే కుటుంబం’ అనే నినాదం తో భారత్‌ మొదటిసారిగా జీ20 శిఖరాగ్ర సదస్సును నిర్వహిం చింది. ఢల్లీిలో శనివారం ప్రారంభమైన ఈ సదస్సు రెండు రోజు లు జరిగింది. అధ్యక్ష హోదాలో భారత్‌ ఏడాది పొడవునా 60 నగరాల్లో అనేక అంశాలపై చర్చలు, 220కి పైగా సమావేశాలు నిర్వహించింది. 1997లో ఆసియాలో ఆర్థిక సంక్షోభం తలెత్తిన తర్వాత ప్రపంచంలో ఆర్థికంగా శక్తిమంతమైన దేశాలన్నీ కలిసి ఓ గ్రూపు ఏర్పాటు చేయాలని భావించాయి. దీంతో 1999 బెర్లిన్‌లో తొలిసారి జీ20 సదస్సును నిర్వహిం చారు. వాస్తవానికి జీ20కి ప్రధాన కార్యాలయం ఏమీ లేదు. ఏ దేశంలో సదస్సు నిర్వహి స్తారో ఆ దేశమే ఏర్పాట్లు చూసుకుం టుంది. ఆ దేశమే అధ్యక్షత వహిస్తుంది. ఈ అధ్యక్ష ఎన్నిక కోసం జీ20ని ఐదు గ్రూపులుగా విభజించారు. గ్రూపులు వారీగా అధ్యక్ష బాధ్యతలు అందుతాయి. ఆ గ్రూప్‌లో ఓటింగ్‌ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో భారత్‌కు ఈ ఏడాది అవకాశం వచ్చింది. జీ20 అనేది 20 దేశాల కూటమి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రణాళికలను చర్చించే వేదిక. ఆర్థిక వ్యవస్థ విషయంలో ప్రపంచం ఎదుర్కొం టున్న సమస్యలను జీ20 వేదికగా దేశాధినేతలు చర్చించి, పరి ష్కారాలను కనుగునే ప్రయ త్నాలు చేస్తుంటారు. ఈ కూటమిలోని దేశాలు ప్రపంచ ఉత్పత్తిలో 85 శాతం, వాణిజ్యంలో 75 శాతం వాటా కలిగి ఉన్నాయి. ప్రపంచంలోని రెండొంతులు జనాభా ఈ సభ్యదేశాల్లోనే ఉంది. జీ 20 సభ్యదేశాలు.. అమెరికా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, కెనడా, చైనా, ఫ్రాన్స్‌, జర్మనీ, భారత్‌, ఇండోనేషియా, ఇటలీ, జపాన్‌, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణ ఆఫ్రికా, దక్షిణ కొరియా, తుర్కియే, యూకేతో పాటు స్పెయి న్‌ శాశ్వత అతిథిగా ఉంది. ఈ జీ20 దేశాల్లోని బ్రెజిల్‌, రష్యా, భా రత్‌, చైనా, దక్షిణ ఆఫ్రికాలు బ్రిక్స్‌ కూటమిగా ఏర్పడ్డాయి. ఇందు లో అర్జెంటీనా, ఈజిప్ట్‌, ఇరాన్‌, ఇథియోపియా, సౌదీఅరే బియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లు కొత్తగా చేరనున్నాయి. ఈఆరుదేశా లకు ఆహ్వానాలు అందాయి. తాజాగా, ఢల్లీిలో జరిగిన ఈ సదస్సు స్థిరమైన అభివృ ద్ధిపై దృష్టి కేంద్రీకరించింది. అలాగే, అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఆర్థిక వృద్ధిని విస్తృతం చేసేందుకు తీసుకోవాల్సినచర్యలపై చర్చించనుంది. వాతావరణ మార్పులు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, పేదరికంపై పోరాటానికి ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు తీసుకోవాల్సిన చర్యలు వంటి విషయా లపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మాట్లా డతారని వైట్‌ హౌస్‌ వర్గాలు తెలిపాయి. అయితే, ఈసదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాది మిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పిం గ్‌లు దూరంగా ఉన్నారు. క్రియాశీలకమైన విజయాలు.. సుస్థిర భవిష్యత్తు కోసం హరిత అభివృద్ధి ఒప్పందం., భవిష్యత్‌ తరాల ప్రయోజనాలను పరిరక్షిం చడానికి సుస్థిర అభివృద్ధికి జీ20 కార్యక్రమం గణనీయమైన ప్రాధాన్యత ఇచ్చింది. దీనిని సాధించ డానికి, అభివృద్ధి చెందిన దేశాలు 100 బిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవడా నికి వీలుగా క్లైమేట్‌ ఫైనాన్స్‌ యంత్రా ంగాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్ర మం 2025 తర్వాత ప్రతిష్టాత్మక న్యూ కలెక్టివ్‌ క్వాంటిటేటెడ్‌ గోల్‌ (ఎన్సి క్యూజి)కు సంకేతం ఇచ్చింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల దిశగా వేగవంతమైన పురోగతి ఒక కీలక దృష్టి, పరిష్కా రాలను రూపొందించడానికి వివిధ దేశాల నుండి డేటాను యాక్సెస్‌ చేయడం ద్వారా మద్దతు ఇవ్వ బడిరది.లింగ సమానత్వం, సాధికారత మహిళలు: విద్యలో బాలి కలు, శ్రామిక శక్తిలో మహిళల సమ్మిళిత భాగస్వామాన్ని జీ20 సమ్మిట్‌ సూచించింది. మహిళా ఆధారిత ఆరోగ్య సంరక్షణను అం దించడానికి, బ్యాంకు ఖాతాల ప్రాప్యత ద్వారా మహిళలకు అవకా శాలను పెంచడానికి భారత్‌ చేస్తున్న ప్రయత్నాలను ప్రదర్శిం చింది. స్టెమ్‌ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడాన్ని కూడా ఈ సదస్సు నొక్కి చెప్పింది. జీ20 భారత్‌ అధ్యక్షతన కింద, ఆఫ్రికన్‌ యూనియన్‌ను కూడా శాశ్వత సభ్యత్వం కల్పించడం ద్వారా గ్లోబల్‌ సౌత్‌ ప్రాతినిధ్యాన్ని మరింత విస్తరించారు. జీ21 సరికొత్త యుగం ప్రారంభమైంది. వచ్చే ఏడాది సమావేశంలో అంటే 2024లో పసిఫిక్‌ ఐలాండ్‌ దేశాలకు కూడా చోటు కల్పించి జీ21ను జీ22గా మార్చేందుకు అవకాశం వుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు