- రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిన ఘనుడు
- కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లే
- బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి..
- కల్వకుర్తి ముద్దు బిడ్డ మన ఆచారన్న
- ఆచారిని గెలిపించుకుందాం.. అభివృద్ధికి బాటలు వేద్దాం
- ప్రజా సమస్యలపై అలు పెరుగని పోరాటం నాయకుడు
- తల్లోజు ఆచారికి మద్దతుగా ఈటల రాజేందర్ ప్రచారం
కల్వకుర్తి : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అధికారమిస్తే బడుగు బలహీన వర్గాల కు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని కల్వకుర్తి లో ఆచారినీ గెలిపించండి… రాష్ట్రవ్యాప్తంగా కల్వకుర్తి లాంటి సంకేతాలు అందాలని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండ మండల కేంద్రంలో బీజేపీ సకలజనుల విజయసంకల్ప ఎన్నికల బహిరంగ సభ ను కల్వకుర్తి బీజేపీ అభ్యర్థి ఆచారి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఢిల్లీ సర్కార్ మెడలు ఉంచడానికి మొదటగా రాజీనామా చేశానని అన్నారు. కేసీఆర్ కు ఓటు వేస్తే ఇంట్లో ఒకరికే పెన్షన్ ఇస్తాడని బీజేపీకి ఓటు వేస్తే అర్హులైన భార్యాభర్తల ఇద్దరికీ పెన్షన్ అందిస్తుందని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. తెలంగాణకు చెందిన సంపద ముఖ్యమంత్రి కేసీఆర్.. హర్యానా, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన రైతులకు పంచుతున్నాడని, తెలంగాణ రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారిని పరామర్శించిన పాపాన పోలేదని మండిపడ్డారు. అప్ కి సర్కార్ కిసాన్ కి సర్కార్ అని నినాదాలు ఇస్తున్న కేసీఆర్, మాట ఇస్తే మోసం చేయడం అయన నైజం అన్నారు. కల్వకుర్తి ప్రజల కష్టాల గురించి ఏనాడు గత అసెంబ్లీలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడిన దాఖలాలు లేవన్నారు.

కల్వకుర్తి ప్రజలను నమ్ముకొని 5 సార్లు ఓటమిని చవిచూసిన ఏనాడు నిరుత్సాహ పడకుండా ప్రజా ఉద్యమాలు చేసిన ఏకైక నాయకుడు ఆచారి.. అలాంటి నాయకుడికి ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ది అంటే ఎంటో చూపిస్తాడు. అవకాశం ఇవ్వండి ఇంటి బిడ్డలా పనిచేస్తాడు.. దేశంలో, రాష్ట్రంలో వచ్చేది బీజేపీ సర్కారే, గజకర్ణ గోకర్ణ విద్యలు కేసీఆర్ దగ్గరే ఉన్నాయి. బందులన్నీ బందు పెట్టి ఎన్నికలలో పావులుగా వాడుకుంటున్న వ్యక్తి కేసీఆర్. దేశంలోనే మొట్టమొదటిసారిగా దళితున్ని రాష్ట్రపతిని చేసింది.. గిరిజన జాతికి చెందిన మహిళల రాష్ట్రపతి చేసింది బీజేపీ మోడీ సర్కారే.. సమ్మె చేయడానికి వీలు లేదని సంఘాలు ఉండకూడదు అని 1700 మంది పారిశుద్ధ్య కార్మికులను తొలగించినందుకు కేసీఆర్ ను ప్రశ్నించా.. కాబట్టే భూ కబ్జా చేశానంటూ నిందలు వేస్తే బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నీది కిసాన్ సర్కార్ అయితే రైతులకు మద్దతు ధర ఎందుకు ఇవ్వలేదు. ఈ దేశంలో వరి రైతులకు క్వింటాలు కు రూ. 3100 మద్దతు ధర ప్రకటించింది బీజేపీ, మాట ఇస్తే తప్పే వ్యక్తి కేసీఆర్కె, మాట ఇస్తే తప్పని వ్యక్తి మోడీ.. నిరుద్యోగులకు ప్రభుత్వ ప్రైవేటుపరంగా ఉద్యోగాలు కల్పిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కర్ణాటక ఎమ్మెల్యే కృష్ణా నాయక్, ఆమనగల్లు మాజీ జెడ్పిటిసి కండే హరిప్రసాద్, బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ గోరటి నరసింహ, రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు సింగం శ్రీను, బీజేపీ సీనియర్ నాయకులు చిందమ్, కృష్ణయ్య, బండెల రామచంద్రారెడ్డి, ఎన్నం శేఖర్ రెడ్డి, ఎన్నం విజేందర్ రెడ్డి, ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, ఆమనగల్లు మున్సిపల్ కౌన్సిలర్లు యాదమ్మ శ్రీశైలం యాదవ్, గజ్జె యాదమ్మ, చేట్టిమల్ల చెన్నకేశవులు, చెక్కల లక్ష్మణ్, దివ్య శ్రీకాంత్ సింగ్, దుడ్డు కృష్ణ యాదవ్, తల్లోజు విజయ కృష్ణ, ఏలే రమేష్, ఏలే మహేష్, ఖాజా, నాగిశెట్టి, ఆనంద్, సామ మల్లారెడ్డి, సామ తిరుమలరెడ్డి, దండు శ్రీను, జానయ్య, బిజెపి నాయకులు, కార్యకర్తలు, ఆచారి అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.