మనీలా : ఫిలిప్పీన్స్ చేపల వేటను అడ్డుకునేందుకు వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోని స్కార్‌బోరో ప్రాంతంలో తేలియాడే కంచెను ఏర్పాటు చేసింది. తమ చేపల వేట పడవలు రాకుండా బీజింగ్ ఇలా చేసిందని ఫిలిప్పీన్స్ ఆరోపించింది. అయితే వెంటనే ఆ కంచెను తొలగించామని తెలిపింది. ఈ ఘటనపై ఆ దేశ కోస్టుగార్డు ప్రతినిధి జైటర్రేలా ట్విటర్‌లో స్పందించారు. ‘గత శుక్రవారం సాధారణ సముద్ర గస్తీ సమయంలో ఫిలిప్పీన్స్ కోస్టుగార్డు ఈ తేలియాడే కంచెను గుర్తించింది. ఇది దాదాపు 980 అడుగులపైనే ఉంది. బాజో డె మాసిన్‌లోక్ ఆగ్నేయ ప్రాంతంలోని స్కార్‌బోరోలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఉన్న సముద్ర దిబ్బలవైపు మా చేపల వేట పడవలు రాకుండా చైనా ఇలా చేస్తోంది’ అని ఆ ప్రతినిధి వెల్లడిరచారు. చైనా బోట్లు ఫిలిప్పీన్స్ నౌకలను 15 సార్లు రేడియో సెట్‌లో హెచ్చరించాయి. చైనా చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నాయి. కానీ ఫిలిప్పీన్స్ నౌకలో కొందరు మీడియా సిబ్బంది ఉన్నారని తెలుసుకుని చైనా నౌకలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. మరోవైపు చైనా ఈ ప్రకటనను ఖండిరచింది. ఫిలిప్పీన్స్ రాజకీయ ఆరోపణల కోసం తప్పుడు సమాచారాన్ని వాడుకుంటోందని పేర్కొంది. ఈ మేరకు చైనా ప్రతినిధి మావో నింగ్ ప్రకటన వెలువరించారు.