Friday, July 19, 2024

జీవితంలో బాల్యం ఓ అద్భుతమే

తప్పక చదవండి

కాలం మారే కొద్దీ అన్ని విషయాల్లో మార్పులు చోటుచేసుకుంటేనే ఉన్నాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో పురోగతిని పొందు తూనే ఉన్నాము. కానీ ప్రతి మనిషి జీవితంలో ఒక అరుదైన సమయం అయినా బాల్యం గురించి కొంత అశ్రద్ద పెడుతున్నాం అనేది వాస్తవం. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మనసులో మెదిలినప్పుడు ఈ ఆర్టికల్‌ కు బీజం పడిరది. చిన్నప్పుడు ఊళ్లో ఎంతో కల్మషం లేని ఆలోచనలతో జట్టు కట్టి స్నేహితులతో సరదాగా గడిపిన బాల్యం ఎన్నో నేర్పింది. ఎలాంటి స్వార్థం లేకుండా అందరితో కలిసిపోయే కలివిడితనాన్ని నేర్పే నైజం బాల్యానిది. చిన్నతనంలో ఆడిన ప్రతి ఆట ఆలోచన సరళిని నేర్పేది. రేస్‌ ,చెడుగుడు అనే ఆటలు మనకు తెలియకుండానే శారీరక దారుఢ్యానికి సహయపడేవి. కొతికొమ్మ, చిర్రగొనే ఇలా చెప్పుకుంటే పోతే ఒకటి ఎంటి ఎన్నో రకాల ఆటలు మానసిక ఉల్లాసానికి అద్దం పట్టేవే. జాజీరి ఆటతో అందరూ ఒకటై ఆడిన ఆట తీరు ఐక్యతాను, నాయకత్వ లక్షణాలను నేర్పేది. చిన్నతనం లో చేసిన ప్రతి పని, ఆడినా ప్రతి ఆట జీవితంలో ఒక మరుపు రాని మరువలేనిది గొప్ప అద్భుతమైన జ్ఞాపకం.కబడ్డీ లాంటి ఆటలు గెలువలనే ఆత్మవిశ్వాసాన్ని అలవాటు చేసేది. వేసవి కాలంలో చెరువు గట్టు వెంట ఒకటై కలిసి తాటి ముంజలు,ఈత కాయల వేటకు వెళ్ళి దొరికిన వాటిని సమానంగా పంచుకునే సహనం బాటలో నడిపించిది బాల్యం. బావుల్లో, చెరువులో ఈత వెళ్లినప్పుడు వెంట ఉండి నేర్పి ముందుకు నడిపించిన నేస్తం బాల్యం. జీవిత ప్రయాణంలో ఎన్నో నేర్చుకునే ప్రయత్నం లో ఎన్ని సార్లు విఫలం అయినా తిరిగి మళ్ళీ ప్రయత్నించే వ్యక్తిత్వం బాల్యం అప్పుడే అందించింది. నేటి ఆధునిక కాలంలో సమయపాలన లేని జీవిత చక్రంలో బాల్యం నాలుగు గోడల మధ్య బంధి అయి దిక్కుతోచని స్థితిలో బిక్కుమంటుంది. మొపెడు బరువుతో కూడిన పుస్తకాలతో భారంగా ముందుకెళ్తోంది. తోటి వారితో ఆత్మీయ నేస్తంగా కలిసి నడిచే స్నేహ మాధుర్యం తగ్గిపో తుంది. నేటి బాల్యం ఎంతసేపు ఆన్లైన్‌ గేమ్స్‌ తో ఆగం అవుతుం ది. విజ్ఞానాన్ని పొందే క్రమంలో మనోల్లాసం కోల్పోయే పరిస్థితు లు దాపరించాయి. పల్లెల్లో ఆడే ఆటలు నేడు కంటికి కనిపిం చానంత దూరంలో ఉండిపోయాయి. కనీసం వాటి పేర్లు కూడా కానరాకుండా ఉన్నాయి. ప్రతి ఒకరి జీవితం అనే ప్రపంచంలో బాల్యంలో గడిపిన ప్రతిక్షణం ప్రభావం చూపుతుంది. నడక నేర్చి న ప్రయాణంలో అడుగుల తడబాటు కాలం నుండి సైకిల్‌ నడప డం రావడానికై ప్రయత్నించిన తీరు నిశితంగా వెనుతిరిగి ఒక సారి ఆలోచిస్తే మనఆత్మవిశ్వాసం ఎంతగొప్పదో తెలియ జేస్తుంది. అలాంటిది ఎన్నో గొప్ప గొప్ప చదువులు చదువుకుని లక్ష్యం చేరే గమనంలో ఒడిదొడుకులకు భయపడి కుంగిపోవడం దేనికి సంకేతం అని ఆలోచించాలి. ఎవరైనా జీవితంలో ఓడిపో యిన ప్రతిసారి బాల్యాన్ని గుర్తుచేసు కుంటే చాలు తిరిగి కొండం తా ప్రేరణను, ఆత్మవిశ్వా సాన్ని ఇస్తుంది. బాల్యానికి అంతటి శక్తి ఉంది. ఒకప్పటి బాల్యం జ్ఞానంతో కూడిన ఆటలను నేర్పేది. తెలి యని గొప్ప ఆత్మ విశ్వాసాన్ని అలవాటు చేసేది. నేటి బాల్యం గంటల కొద్దీ పబ్జీ గేమ్స్‌, పలు రకాల ఆన్లైన్‌ గేమ్స్‌ తో విలువైన కాలాన్ని దుర్విని యోగం చేసుకుంటూ విలువలను, స్నేహాన్ని, నేస్తం పాలిట జ్ఞాపకాలను దూరం చేసుకుంటుంది. చిన్న చిన్న విషయాలకే ఆవేశపడి అనర్థాలకు తెర లేపుతుంది. ఆలోచించే అలవాటును మరిచి పోయింది. మారుతున్న కాలంతో పాటు అన్ని విషయాల్లో అవగా హన పొందాలి దానికై శ్రమించాలి కానీ వాటి కోసం జీవితంలో శాశ్వతంగా నిలిచిపోయే కొన్ని విలువలు నేర్పే జ్ఞాపకాలను పాతరేయకుడాదు. ఎంత సేపు మార్కులు, ర్యాంకులే కాదు మనిషి వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేసే ప్రయత్నాలు చేయాలి. దీనికై విద్యా వ్యవస్థ, తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి.
` వంశీకృష్ణ గౌడ్‌ బండి 9550837962

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు