మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అనేక మంది బాల, బాలికలు బడికెళ్ళె వయస్సు లో బతుకు బండి లాగుతూ బాల కార్మికులుగా జీవితాలను గడుపుతున్నారు. మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 77 సంవత్సరాలు కావస్తున్న ఇంకా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి సరైన ప్రణాళికలు రూపొందించక పోవడం ఆందోళన కరమైన విషయం.మన దేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవ సందర్భంగా (నవంబర్ 14) బాలల దినోత్సవం జరుపుకుంటారు.వేదికల మీద పెద్దలు పనిలో, పిల్లలు బడిలో,బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్నామని,బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తామని ఉపన్యాసాలు ఇస్తూ తర్వాత బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన గురించి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కరమైన విషయం. 14 సంవత్సరాల బాల, బాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని భారత రాజ్యాంగంలో స్పష్టంగా లిఖించ బడినప్పటికి ఆచరణలో మాత్రం అమలు కాకుండా అనేక మంది పాఠశాలలకు దూరమై బాలకార్మికులుగా దుర్భర జీవితాలను గడుపుతున్నారు. మెకానిక్ షెడ్‌లలో, బట్టల దుకాణాలలో, నిత్యావసర వస్తువుల విక్రయ దుకాణాలలో బాల కార్మికులు బాలల బాల్యం మెకానిక్ షెడ్ లలో బందీ అవుతుంది.సైకిల్, స్కూటర్,కారుల మెకానిక్ షెడ్ లలో అనేక మంది బాల కార్మికులు పని చేస్తున్నారు.ఉదయం 8 గంటల నుండి రాత్రి 10,11 గంటల వరకు బాల కార్మికుల చేత తక్కువ వేతనాలు ఇస్తూ ఎక్కువ పనులు చేయించుకుంటున్నారు.మెకానిక్ షాపులలో పనిచేసే బాల కార్మికులను ప్రజాస్వామ్య వ్యవస్థలో మాట్లాడుకోని విధంగా నానా బూతులు తిడ్తుంటారు. బట్టల దుకాణాలలో, నిత్యావసర వస్తువుల విక్రయ దుకాణాలలో, హోటళ్ళలో, టీ షాపులలో,పాల విక్రయ కేంద్రాలలో ప్రతిచోట బాల కార్మికులు పనిచేస్తూ దిన దిన గండంగా తమ జీవితాలను గడుపుతున్నారు. భారత రాజ్యాంగంలో బాల, బాలికల హక్కుల కోసం అనేక చట్టాలు ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదు. అనేక ఫ్యాక్టరీలలో పోగ గొట్టాలలో అనేక మంది బాలలు 12 గంటలు అతి తక్కువ వేతనాలకు పని చేస్తున్నారు. కార్మిక చట్టాల ప్రకారం 8 గంటలు మాత్రమే పని చేయాలని ఉన్నా 12 గంటల వరకు పని చేపించుకుంటున్నారు. బట్టల దుకాణాలలో, నిత్యావసర వస్తువుల విక్రయం చేసే జనరల్ స్టోర్స్ లలో, సూపర్ మార్కెట్‌లలో, హోటళ్ళలో,టీ షాపులలో, ఆసుపత్రులలో అనేక చోట్ల బాల కార్మికులు పనిచేస్తున్నారు. ఉదయం పాల,వ్యాపారం ఇంటింటికి వెళ్లి పాలు,పేపర్ వేయడం బాలలే చేస్తూ బాల కార్మికులుగా మారుతున్నారు. అమ్మాయిలు బి.డి.లను తయారు చేయడం, ఇండ్లలో పాచి పనుల కోసం పనిమనిషులుగా పని చేయడం, దుకాణాలలో సెల్స్ గర్ల్స్ గా పని చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాల, బాలికలను బాల కార్మికులుగా పనులలో పెట్టుకోవద్దని కార్మిక శాఖ, రెవెన్యూ శాఖ, జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో పోలీసుల సహాయంతో దుకాణాల మీద తనిఖీలు నిర్వహించి బాల బాలికలు పనులలో పెట్టుకున్న యాజమాన్యం పై చర్యలు తీసుకుంటున్నారు.కొంతమంది అవినీతి అధికారుల వలన ఏ దుకాణాల మీద తనిఖీలకు వెళ్తున్నారో వారికి ముందే తెలియజేయడం వలన తనిఖీల సందర్భంలో బాలలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలు.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలి.బాల, బాలికలను పనులలో పెట్టుకున్న దుకాణాల యజమానుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి.బాల, బాలికలకు రాజ్యాంగంలో ఉన్న విధంగా 14 సంవత్సరాల లోపు విద్యార్థులకు వారి వారి మాతృ భాష లో ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలి.బాల, బాలికల కోసం ప్రత్యేకంగా హాస్టళ్లు ఏర్పాటు చేయాలి.బాల, బాలికలను బడికి పంపకుండా పనులకు పంపే తల్లిదండ్రులకు విద్య యొక్క ఆవశ్యకతను, బాల కార్మిక చట్టాల గురించి అవగాహన కార్యక్ర మాలను నిర్వహించాలి. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు పిల్లలు పనిచేయనిదే నడవదు అనే వారికి పిల్లలను పాఠశాలలకు పంపితే బ్యాంకుల ద్వారా లోన్ లు ఇప్పించి స్వయం ఉపాధి కల్పించేటట్లు చూడాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను బాల కార్మికులుగా పనిచేపించే తల్లిదండ్రులకు అందకుండా చేయాలి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత అనుకోకుండా స్వచ్చంద సంస్థలు, తల్లిదండ్రులు, సమాజం లోని ఉపాధ్యాయులు, విద్యావంతులు,ఉద్యోగులు, అధికారులు అందరూ కలిసి కట్టుగా పనిచేసినప్పుడు బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు చనిపో యిన అనాధ పిల్లల రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. బంధు వులు అనాధ పిల్లల రక్షణ బాధ్యత తీసుకున్న వారికి సరైన రక్షణ, సరైన నిత్యావసరాలు, సరైన విద్య అందించకుండా ఏదో ఒక పనిలో బాల కార్మికులుగా పని కోసం పెడుతున్నారు.అనాధ పిల్లలకు తల్లిదండ్రుల ఆలనాపాలనా లేక బంధువుల రక్షణ లేక విద్యకు దూరమై పనికి దగ్గర అవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అనాధ పిల్లల రక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటున్నదని విద్యార్థులకు ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో నుండి తీసి వేసి గురుకులాల్లో చేర్చుతున్నారు. కే.జి నుండి పి.జి.వరకు ఉచిత విద్యను అందిస్తున్నామని చెబుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసి ఆర్ అనాధ పిల్లలకు గురుకులాల్లో చేర్చకుండా అనాధ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రత్యేకమైన పాఠశా లలను ఏర్పాటు చేయాలి. అనాధ పిల్లలకు బి.సి.ఎ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. అలాకా కుండా ఎస్.సి లకు ఎస్.సి., ఎస్టీలకు ఎస్టీ సర్టిఫికెట్ జారీ చేయాలి ఇంకా అవసరమైతే ఎస్సీ, ఎస్టీ సర్టిఫికెట్ కంటే కూడా ఎక్కువ రిజర్వేషన్‌లను కల్పించి మానవ త్వాన్ని చా టాలి. తల్లిదండ్రులు లేని కొరతను ప్రభుత్వం తీర్చాలి మన దేశం లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో బాల కార్మిక వ్యవస్థలేని రాష్ట్రాలుగా మారాలని కోరుకుందాం!
` డాక్టర్.ఎస్.విజయ భాస్కర్ 9290826988
తప్పక చదవండి
-Advertisement-