Wednesday, July 24, 2024

జివో 111 రద్దు

తప్పక చదవండి
 • హెచ్‌ఎండీఏ పరిధి విధివిధానాలే ఆ గ్రామాలకు వర్తింపు
 • 39 డిఎంహెచ్‌వో పోస్టుల మంజూరు
 • విఆర్‌ఎలను రేగులరైజ్‌ చేసేందుకు కేబినెట్‌ నిర్ణయం
 • రెండో విడత గొర్రెల పంపిణీకి నిర్ణయం.
 • వనపర్తి లో జర్నలిస్ట్‌ భవనానికి, ఖమ్మంలో 23 ఎకరాలు కేటాయింపు
 • మైనార్టీ కమిషన్‌ లో జైన్‌ కమ్యూనిటిఇ చేరుస్తూ నిర్ణయం
 • టిఎస్‌పిఎస్‌లో 10 పోస్టులను కొత్తగా భర్తీ
 • మక్కలు, జొన్నలు కొనేందుకు నిర్ణయం
 • ఉమామహేశ్వర లిప్ట్‌ ఇరిగేషన్‌ స్కిమ్‌ పేజ్‌ 1, 2 కేబినెట్‌ నిర్ణయం
 • సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన కేబినేట్‌
 • వివరాలు వెల్లడిరచిన మంత్రి హరీష్‌ రావు

హైదరాబాద్‌ : నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్‌ అధ్యతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర లభించింది. హైదరాబాద్‌ శివారు జంట జలాశయాలకు రక్షణగా ఉన్న 111 జీవోను పూర్తిగా ఎత్తివేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి హరీష్‌ రావు ప్రకటించారు. హెచ్‌ఎండీఏ పరిధి విధివిధానాలే జోవో 111 గ్రామాలకు వర్తిస్తాయని చెప్పారు. తెలంగాణలో 38 డీఎంహెచ్‌ వో పోస్టులు మంజూరు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. 33 జిల్లాలకు ఒక్కోటి చొప్పున..అలాగే హైదరాబాద్‌ పరిధిలోని జోన్ల వారీగా ఆరు డీఎంహెచ్‌ వో పోస్టులు మంజూరు చేసింది. అలాగే కొత్తగా ఏర్పడిన 40 మండలాల్లో పీహెచ్‌ సీలు మంజూరుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. వీఆర్‌ఏలను రెగ్యులరైజ్‌ చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇకపోతే గండిపేట, హిమాయత్‌ సాగర్‌ జలాశయాలను కాళేశ్వరం ప్రాజెక్టులతో లింక్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. హుస్సేన్‌ సాగర్‌ను కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో లింక్‌ చేయాలని నిర్ణయించారు. కులవృత్తులను బలోపేతం చేయాలని నిర్ణయం..ఇందుకోసం సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం…నకిలీ విత్తనాలను సరఫరా చేసే వారిపై పీడీ యాక్టులు పెట్టాలని మంత్రవర్గం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సమావేశం మూడు గంటల పాటు సాయంత్రం 6:15 గంటల వరకు సాగింది. దాదాపు మూడు గంటలకు పైగా మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, గంగుల కమలాకర్‌ తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించి వివరించారు. రంగారెడ్డి జిల్లాలో 111 జీవో ను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హెచ్‌ఎండీఏ పరిధి విధివిధానాలే జోవో 111 గ్రామాలకు వర్తింపు చేస్తూ నిర్ణయించారు. అలాగే తలంగాణలో 38 డీఎంహెచ్‌ వో పోస్టులు మంజూరు చేశారు. కొత్తగా 40 మండలాల్లో పీహెచ్‌ సీలు మంజూరు చేశారు. అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లలో పర్మినెంట్‌ ఉద్యోగులను పెట్టాలని నిర్ణయించారు. జైన్‌ కమ్యూనిటీని మైనార్టీ కమిషన్‌ పరిధిలోకి తీసుకురావటం. ఆ వర్గానికి చెందినవారికి సభ్యుడిగా అవకాశం ..మొత్తం కమిషన్‌ లో 9 మంది సభ్యులుగా నిర్ణయించారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బలోపేతం చేస్తూ కొత్తగా 10 పోస్టులు మంజూరుకు ఆమోదం ఇచ్చారు. వీఆర్‌ఏలను క్రమబద్ధీకరించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ఉమామహేశ్వర లిప్ట్‌ ఫేజ్‌ 1, ఫేజ్‌ 2ల ప్రాజెక్టు పనులకు ఆమోదం లభించింది. గొర్రెల పథకానికి సంబంధించి మరో 15 రోజుల్లో రెండవ విడత గొర్రెలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వనపర్తిలో జర్నలిస్టు భవనానికి పది గుంటల భూమిని మంజూరు చేస్తూ కేబినేట్‌ నిర్ణయం తీసకకుంది. ఖమ్మంలో జర్నలిస్టుల ఇండ్ల కోసం 23 ఎకరాల భూమిని మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే రాష్ట్రంలో మక్కలు, జొన్నల కొనుగోలుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. తండాకు ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ ను మంజూరు చేస్తూ నిర్ణయించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను 21 రోజుల పాటు నిర్వమించాలని నిర్ణయించారు. .ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమం ఉండేలా కార్యాక్రమాలను చేపట్టబోతున్నారు. కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారిని మరింత ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మంత్రి గంగుల కమలాకర్‌ అధ్యక్షతన కేబినెట్‌ కమిటీ ఏర్పాటు చేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రశాంత్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, జగదీశ్వర్‌ రెడ్డి సభ్యులుగా ఉండనున్నారు. ఈ సబ్‌ కమిటీ విశ్వబ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణులు, రజకులు, మేదరి, కుమ్మరి తదితర వృత్తి కులాల వారికి ప్రోత్సాహకాలు అందించేలా విధివిధానాలు ఖరారు చేయాలని కేబినెట్‌ సబ్‌ కమిటీకి సీఎం ఆదేశించారు. ఈ సబ్‌ కమిటీ విధివిధానాలు ఖరారు చేస్తే దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పథకం అమలు చేయాలని సీఎం ఆదేశించారు. రాబోయే రోజుల్లో కొడపోచమ్మ సాగర్‌ లో ఉన్న కాళేశ్వరం జలాలతో మూసీ, గండిపేట్‌, హిమాయత్‌ సాగర్‌ ను లింక్‌ చేయాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. స్వచ్ఛమైన మూసీగా మార్చడం సహా గండిపేట, హిమాయత్‌ సాగర్‌ను నిండు కుండలా మార్చాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాక, హుస్సేన్‌ సాగర్‌ను కూడా గోదావరి జలాలతో లింక్‌ చేయాలని, అందుకు డిజైన్లను రూపకల్పన చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
నకిలీ విత్తనాల మీద ఉక్కుపాదం మోపాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే పీడి యాక్ట్‌ పెట్టాలని కేబినెట్‌ ఆదేశం ఇచ్చింది.

“““““““`

- Advertisement -

కళ్లులేని కాబోదులు వాళ్ళు..

ప్రతి పనికిమాలినోడు విమర్శించడమే.. ప్రతివాడూ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఎక్కడ అంటాడు..
కట్టిన ఇండ్లు కనిపిస్తలేవా..? అందరికీ ఇల్లు ఇస్తాం..ఎవరూ భయపడొద్దు
మహిళపై నోరు పారేసుకున్న మంత్రి తలసాని..

హైదరాబాద్‌, 18 మే ( ఆదాబ్‌ హైదరాబాద్‌ ) :
ప్రతి పనికిమాలినోడు ఇల్లు ఎక్కడ కట్టారని విమర్శలు చేస్తున్నాడు.. వాడికి కళ్ళు కనిపిస్తలేనట్లు ఉన్నాయని అంటూ.. విపక్షాలపై మంత్రి తలసాని నోరు పారేసుకున్నారు. జూబ్లీహిల్స్‌ కమలానగర్‌లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… 58 జీవో ప్రకారం పేదవారి ఇల్లు రెగ్యులరైజ్‌ చేసినం.. పెన్షన్‌లు ఇస్తున్నాం.. డబల్‌ బెడ్‌ రూంలు కట్టి ఇస్తున్నాం, షాది ముబరక్‌, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం’ అన్నారు.. 126 గుడిసెలను తొలగించి 210 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను నిర్మించామన్నారు. ఇవి పప్పు, బెల్లంలాగా ఎవరికి పడితే వారికి పంచడానికి ఉండదని తెలిపారు. గతంలో ఒక్కో ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి లక్షన్నర అయ్యేదని.. ఇప్పుడు ఒక్కో డబల్‌ బెడ్‌ రూం ఇల్లు నిర్మించడానికి 9 లక్షల రూపాయల ఖర్చు అవుతోందని చెప్పారు. దేశంలో ప్రతి ఒక్కరూ చాలా మాట్లాడుతున్నారని… కానీ పేదల కోసం ఏవి? చేయరని విమర్శించారు. అందరికీ ఇల్లు ఇస్తామని.. ఎవరు భయపడవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఓ మహిళపై మంత్రి తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు ఇప్పించాలని ఓ మహిళ తలసానిని కోరారు. మహిళ విజ్ఞప్తిపై మంత్రి సరైన సమాధానం చెప్పకపోగా.. ఆమెపై సీరియస్‌ అయ్యారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఇలా ఇల్లు కట్టిస్తున్నారా అని తిరిగి మంత్రి ఆ మహిళను ప్రశ్నించారు. మహిళ తనకు ఇల్లు కావాలని కోరగా తనపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తలసాని తీరు బాగా లేదని చర్చించుకుంటున్నారు..

విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ ను మురికి వాడలు లేని నగరంగా మార్చాలన్న సంకల్పంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్రూముల నిర్మాణాన్ని చేపట్టింది. మురికి వాడల్లో గుడిసెలు తొలగించి వాటి స్థానంలో డబుల్‌ బెడ్రూములు నిర్మించి నిరుపేదలకు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం కమలానగర్‌ లో దాదాపు 17 కోట్ల అంచనాతో 210 రెండు పడక గదుల ఇళ్లను నిర్మించింది రాష్ట్ర సర్కారు. ఈ నిర్మాణ సముదాయాన్ని గురువారం రోజు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. 210 డబుల్‌ బెడ్‌ రూముల నిర్మాణానికి మొత్తంగా రూ. 16.27 కోట్లు ఖర్చు అయింది. రూ. 15.5 లక్షల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పించారు. వాటర్‌ ట్యాంక్‌, విద్యుత్‌ సరఫరాతో పాటు 15 దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా షట్టర్‌ లు నిర్మించారు. ఈ రెండు పడక గదుల ఇళ్ల సముదాయానికి ‘డిగ్నిటీ కాలనీ’గా నామకరణం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు