Tuesday, October 3, 2023

70 వేలకు మహిళను కొనుగోలు..

తప్పక చదవండి
  • ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకున్న దుర్మార్గుడు..
  • ఆమె పద్దతి నచ్చకపోవడంతో గొంతు కోసి హత్య..
  • ఢిల్లీలో వెలుగు చూసిన అమానుష ఘటన..
    న్యూ ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి మధ్యవర్తి ద్వారా రూ.70వేలకు ఒక మహిళను కొనుగోలు చేసి వివాహం చేసుకున్నాడు. అయితే ఆమె ప్రవర్తన నచ్చక గొంతుకోసి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ఫతేపూర్‌ బేరీ సవిూపంలోని అటవీ ప్రాంతంలో పడేశాడు. ఈ కేసులో మృతురాలి భర్త ధరమ్‌వీర్‌ తోపాటు అరుణ్‌, సత్యవన్‌ అనే మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫతేపూర్‌ బేరీలోని జీల్‌ ఖుర్ద్‌ సరిహద్దు సవిూపంలోని అటవీప్రాంతంలో ఒక మహిళ మృతదేహం లభ్యమైనట్లు శనివారం పీసీఆర్‌కు కాల్‌ వచ్చింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (సౌత్‌) చందన్‌ చౌదరి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా శనివారం తెల్లవారుజామున 1.40 గంటల ప్రాంతంలో ఓ ఆటో కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. దీంతో రిజిస్టేష్రన్‌ నంబర్‌ ఆధారంగా ఛతర్‌పూర్‌ నివాసి అయిన ఆటో డ్రైవర్‌ అరుణ్‌ను పట్టుకున్నారు. విచారణలో అతను మృతురాలు తన బంధువు ధరమ్‌వీర్‌ భార్య స్వీటీ అని తెలిపాడు. మరో బంధువు సత్యదేవ్‌ తో కలిసి హరియాణా సరిహద్దుల్లో స్వీటీని హత్యచేసి అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని పడేసినట్లు పోలీసులకు తెలిపాడు. ’ధరమ్‌వీర్‌ తన భార్య ప్రవర్తనతో సంతోషంగా లేడు. ఆమె తరచూ నెలల తరబడి ఎటువంటి సమాచారం లేకుండా ఇంటి నుంచి పారిపోయేది. ఆమెను ఓ మహిళకు రూ.70,000 చెల్లించి ధరమ్‌వీర్‌ వివాహం చేసుకున్నాడు. మృతురాలి తల్లి దండ్రులు, ఇతర కుటుంబ నేపథ్యం గురించి ఎవరికీ తెలియదు. స్వీటీ కూడా ఆ విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. తాను బీహార్‌లోని పాట్నాకు చెందినదాన్నని మాత్రమే చెప్పింది’ అని విచారణ సందర్భంగా అరుణ్‌ వివరించినట్లు డీసీపీ తెలిపారు. ఈ మేరకు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించినట్లు డీసీపీ వెల్లడించారు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు