- హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు
- తొలుత రాజమండ్రి ఆసుపత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆస్పత్రిలో చేరారు. బుధవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. ఆయన కుడికాలు లాగడంతో కుటుంబ సభ్యులు రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షలు నిర్వహించి “మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్” గా నిర్దారించడంతో మెరుగైన వైద్యం కోసం అంబులెన్సులో హుటాహుటిన హైదరాబాద్ కిమ్స్‌కు తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా మూడు రోజులు అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు సూచించారు.
ఎమ్మెల్యే ఆరోగ్య విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని.. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వారు తెలిపారు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ప్రజల్లోకి వస్తారన్నారు. ఎమ్మెల్యే చిట్టిబాబు బుధవారం జగ్గంపేట ఎమ్మెల్యే కూతురు వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికారు. కొండేటి చిట్టిబాబు 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున పి గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మరోసారి పోటీచేసి విజయం సాధించారు.