- విజ్ఞప్తి చేసిన పీ.డీ.ఎస్.యూ. రాష్ట్ర అధ్యక్షులు, మామిడికాయల పరశురాం..
హైదరాబాద్ : వచ్చే నెల 8 తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగే అఖిల భారత విప్లవ విద్యార్థుల సమ్మేళనాన్ని జయప్రదం చేయండి అని రాష్ట్ర కమిటీ రూపొందించిన గోడ ప్రతీక ను, ఈ రోజు రాష్ట్ర కార్యాలయంలో (సీపీ భవన్) విద్యానగర్ లో ఆవిష్కరించటం జరిగింది.. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యూ. రాష్ట్ర అధ్యక్షులు మామిడికాయల పరశురాం మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల లో విద్యా రంగ, న్యాయ మైన ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తున్న 16 విద్యార్థి సంఘాలు కలిసి, మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను ఎండగడుతూ అక్టోబర్ 8న వేలాది మంది విద్యార్థులతో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ప్రదర్శన అనంతరం సభ నిర్వహించటం జరుగుతుంది.. ఈ సభలో వివిధ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ప్రజాస్వామిక వాదులు పాల్గొని ప్రసంగిస్తారు.. అనంతరం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించటం జరుగుతుంది.. దేశంలో బిజెపి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని మొత్తం నిర్వీర్యం చేస్తూ అశాస్త్రీ భావాలను, మూఢ నమ్మకాలను పెంపొందించే నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి విద్యా ప్రైవేటీకరణ, కాషాయీకరణ వైపు నెట్టివేస్తూ పేదలకు విద్యను దూరంచేసే విదంగా కుట్ర చెస్తోంది.. ప్రభుత్వం విద్యాలయాల కు అధిక నిధులు కేటాయించాకుండా నిర్లక్ష్యం చేస్తూ.. సమస్యల వలయంలోకి నెట్టివేస్తుంది..
తమ ఆధిపత్య భావజాలాన్ని (మనువాదాన్ని) అమలు చేసే వ్యక్తుల చేతుల్లోకి యూ.జీ.సి., ఎన్.సి.ఈ.ఆర్.టి. అప్పజెప్పి ఆశాస్త్రీయ బవజాలన్నీ, సిలబస్ పేరుతో విద్యర్తుల మెదళ్ల లోకి జోప్పిస్తున్నారు.. ఇది చాలా ప్రమాదకరం, ఈ విధానాలను ప్రతిఘటించటం కోసం పెద్ద ఎత్తున తరలి రావాలని అదే విధంగా,
అసమానతలు లేని సమ సమాజ కోసం శాస్త్రీయ విద్యా సాధనే లక్ష్యంగా చేసుకొని మిలిటెంట్ పోరాటాలు నిర్వహించే విద్యార్థులు ఎక్కువ సoఖ్య లో పాల్గొని ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని విద్యార్ధి లోకానికి పిలుపు నివ్వటం జరిగింది.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రియాజ్, గణేష్, నాగరాజు, హైదరాబాద్ నాయకులు నవీన్, శ్యామ్, యశ్వంత్ రెడ్డి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు..