Sunday, December 3, 2023

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

ఎన్నికలొచ్చినప్పుడే
ఎక్కడలేని ప్రేమ
మా దళితుల మీద
మీకు ఇగురుపెడ్తది..
కులం పేరుతో ఒకడు
కుతికేపిస్కితే.. ఊరుపేరుతో ఇంకొకడు
ఉరేసి సంపుతున్నడు..
మా పేదల శవాలమీద
చిల్లర ఏరుకోనే చిల్లర కొడుకులై,
పచ్చని పల్లెల్ని పడాం చేస్తున్నరు..
మెడల చుట్టూ మీరేసే
కండువాలు పేదలను ఉరితీసే ఉరితాళ్లు..
మా భుజాలపై మోసేటి జెండాలు
మీరు తొక్కాలనుకునే ఉక్కు పాదాలు..
మా గొంతులో మోగేటి నినాదాలు
భవిష్యత్ తరమంత తల్లడిల్లే తండ్లాటలు…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు