Sunday, September 8, 2024
spot_img

స్కూలు బస్సు కింద పడి ప్రాణాలు విడిచిన మూడేళ్ళ చిన్నారి

తప్పక చదవండి
  • అన్న స్కూల్‌కు వెళ్తుండగా శనివారం సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వెళ్లిన చిన్నారి

చిన్నారి భవిష్య ఒక్క సారిగా బస్సు కింద పడి చనిపోవడంతో కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన మేడ్చల్ జిల్లా పరిధిలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఆనంద్ నగర్ ఎక్స్ సర్వీస్మెన్ కాలనీలో శనివారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారి తన అన్న స్కూల్‌కు వెళ్తుండగా శనివారం సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వెళ్లింది. అంతలోనే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఒక్కసారిగా బస్సు వేగం వల్లనా బస్సు కింద పడి మరణించింది. ఆనంద్ నగర్ ఎక్స్ సర్వీస్మెన్ కాలనీ నుండి రోజు వెళ్ళే రచన గ్రామర్ స్కూల్ బస్సులో బాలిక అన్నయ్య స్కూల్ కు వెళ్తుంటాడు. శనివారం ఉదయం రోజు లానే బస్సు వద్దకు దించేందుకు వెళ్తుండగా డ్రైవర్ చిన్నారిని బస్సుతో ఢీకొట్టాడు. తీవ్రగాయాలైన చిన్నారిని తల్లిదండ్రులు, స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పాప మృతి చెందినట్లు తెలియజేశారు. దీనితో ఆ తల్లి తండ్రుల దుఃఖం ఆకాశాన్ని అంటింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు