Wednesday, October 9, 2024
spot_img

80 వేల కిలోల గంట..

తప్పక చదవండి
  • ప్రపంచంలోనే అతిపెద్ద గంట..
  • బిగిస్తుండగా ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

కోటా : రాజస్థాన్‌ రాష్ట్రం కోటా నగరంలోని చంబల్‌ రివర్ ఫ్రంట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద గంటను ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని కడుతున్న సమయంలో పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు, గంట ఏర్పాటుకు పనిచేసిన ఇంజినీరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరికొంత మంది గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రమాద సమాచారం తెలియడంతో కోటా జిల్లా యంత్రాంగం, రివర్ ఫ్రంట్‌తో సంబంధం ఉన్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చంబల్ రివర్ ఫ్రంట్ రాజస్థాన్‌లోని కోటాలోని చంబల్ నది ఒడ్డున నిర్మించారు. ఈ నది ముందు భాగంలో 80,000 కిలోల బరువున్న గంటను ఏర్పాటు చేయనున్నారు. దీని శబ్దం 8 కిలోమీటర్ల దూరం వరకు వినబడుతుంది. ఈ గంట ప్రపంచంలోనే అతిపెద్ద గంట. ఇది 5000 సంవత్సరాల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఈ గంటను రివర్ ఫ్రంట్‌కు తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఇంజినీర్ల ఆధ్వర్యంలో పలు సాంచెల్లో అంచెలవారీగా గంటను తయారు చేశారు. ఈ నెల మొదటినుంచి వీటిని ఒక్కొక్కటిగా తెరవడం ప్రారంభించారు. ఈ రోజు తెరిచిన ఒక సాంచెలోని.. అచ్చు అకస్మాత్తుగా విరిగిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న ఇంజనీర్, ఇతర కూలీలు ఈ ప్రమాదానికి గురయ్యారు. ఇంజనీర్ 35 అడుగుల కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఇంజినీరుతో పాటు, ఒక కార్మికుడు మృతి చెందాడు. చనిపోయిన ఇంజనీరే ఈ గంట నిర్మాణంలో కీలకం అని తెలుస్తోంది. అతని పేరు దేవేంద్ర ఆర్య. ఆయన పర్యవేక్షణలో గంటను అచ్చు నుండి బయటకు తీస్తున్నారు. మొదట దేవేంద్ర పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే ఆయన మృతి చెందాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు