Saturday, April 20, 2024

2024 లోనే 5-డోర్ థార్ ఆవిష్కరణ..

తప్పక చదవండి

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ వచ్చే ఏడాది అంటే 2024లో 5-డోర్ థార్ ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాదిలోనే 5-డోర్ థార్ మార్కెట్లోకి రానున్నదని వార్తలొచ్చిన నేపథ్యంలో మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో అండ్ ఫామ్ సెక్టార్ సీఈఓ రాజేష్ జెజూరికర్ స్పందిస్తూ.. 5-డోర్ థార్.. ఈ ఏడాదిలో మార్కెట్లోకి రావడం లేదని వెల్లడించారు. 2024లో మార్కెట్లోకి ఎంటరవుతుందన్నారు.

2020 అక్టోబర్‌లో 3-డోర్ మహీంద్రా మార్కెట్లోకి వచ్చింది. వచ్చేనెలలో మార్కెట్లోకి రానున్న మారుతి సుజుకి జిమ్నీకి తమ 5-డోర్ థార్ గట్టి పోటీదారుగా ఉంటుందన్నారు రాజేశ్ జెజూరికర్. ప్రారంభంలో 4డబ్ల్యూడీ స్లాండర్డ్ థార్ మోడల్ కారు ఆవిష్కరించిన మహీంద్రా.. ఈ ఏడాది ప్రారంభంలో పాపులర్ ఆఫ్ రోడర్ ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్ మార్కెట్లోకి తెచ్చింది. థార్ 5-డోర్ ఇంజిన్ మూడు ఆప్షన్లలో లభిస్తుంది.1.5 లీటర్ల డీ117 సీఆర్డీఈ డీజిల్ (117బీహెచ్పీ/300 ఎన్ఎం), 2.2 లీటర్ల ఎంహాక్ 130 సీఆర్డీఈ డీజిల్ (130 బీహెచ్పీ / 300 ఎన్ఎం), 2.0 లీటర్ల ఎంస్టాలియన్ 150 టీజీడీఐ పెట్రోల్ (150 బీహెచ్పీ/320 ఎన్ఎం) ఆప్షన్లలో లభిస్తుంది.

- Advertisement -

1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ – స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 2.2 లీటర్ల డీజిల్ అండ్ 2.0-లీటర్ల పెట్రోల్ వేరియంట్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిష్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ చాయిస్ కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీ కారు 4డబ్ల్యూడీ, ఆర్‌డబ్ల్యూడీ ఆప్షన్లలో లభ్యం అవుతుంది. వేరియంట్‌ను బట్టి 16-అంగుళాలు లేదా 18-అంగుళాల వీల్స్ వస్తాయి. మహీంద్రా థార్ ధర రూ.10,54,500 నుంచి రూ.16,77,501 మధ్య పలుకుతుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు