Friday, March 29, 2024

లీకేజీతో సంబంధం ఉన్నవారు డీబార్..

తప్పక చదవండి

  • సంచలన నిర్ణయం తీసుకున్న టి.ఎస్.పీ.ఎస్.సి.
  • ఇకపై టి.ఎస్.పీ.ఎస్.సి. నిర్వహించే ఎలాంటి పరీక్షలు
    రాయకుండా కట్టడి చేయాలని ఆదేశాలు..
  • ఇప్పటిదాకా సిట్ 44 మందిపై కేసు నమోదు చేసింది..
    43 మందిని అరెస్ట్ చేసింది..

హైదరాబాద్, 30 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాల లీకేజీతో ప్రమేయమున్న వారిని డీబార్‌ చేయాలని నిర్ణయించింది. సిట్‌ అరెస్టు చేసిన 37 మంది ఇకపై టీఎస్‌పీఎస్సీ నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా చేయాలని కమిషన్‌ ఆదేశించింది. దీనిపై అభ్యంతరాలుంటే రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని 37 మంది నిందితులకు టీఎస్‌పీఎస్సీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) 44 మందిపై కేసు నమోదు చేసింది. 43 మందిని అరెస్టు చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు