Thursday, April 18, 2024

లంచాల సికిందర్.. ” జవాన్ మహేందర్ “..

తప్పక చదవండి
  • కార్మికుల కష్టాన్ని వాటాలేసుకుంటున్న ఉద్యోగులు..
  • డిప్యూటీ కమిషనర్, జవాన్ మహేందర్ ల అక్రమ లంచాల వ్యవహారం..
  • జీ.హెచ్.ఎం.సి. సౌత్ జోన్ సర్కిల్ – 7 లో వెలుగు చూసిన భాగోతం..
  • వీరికి అండగా ఓ ప్రముఖ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి..

హైదరాబాద్, 04 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
అవినీతి మురికి పట్టిన జీ.హెచ్.ఎం.సి. ని ప్రక్షాళన చేయడం పక్కనబెట్టి కొందరు ఉద్యోగులు మరింత మురికిని ఆపాదిస్తున్నారు.. సౌత్ జోన్ సర్కిల్ – 7 డిప్యూటీ కమిషనర్, గౌలిపురా డివిజన్ జవాన్ మహేందర్ లు కలిసి అక్రమ వసూళ్ల దందాను నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ సర్కిల్ లో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న స్వీపర్స్ విధులకు హాజరు కాకపోయినా వదిలేస్తూ.. వారు చేయాల్సిన పనిని ఇతర డివిజన్లలో పని చేస్తున్న తాత్కాలిక ఉద్యోగులైన పారిశుద్ద కార్మికులతో చేయిస్తూ.. ఇంటిదగ్గర కాలం గడుపుతున్న ఉద్యోగుల దగ్గరనుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.. దీంతో పర్మినెంట్ ఉద్యోగాలు చేస్తున్న వారు.. పని చేయకుండానే జీతాలు తీసుకుంటుండగా.. అధిక శ్రమ చేస్తున్న తాత్కాలిక ఉద్యోగులు తమకు సంబంధం లేని పనులు చేస్తూ శారీరకంగా, మానసికంగా క్షోభ అనుభవిస్తున్నారు.. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వారిని కదిలించినప్పుడు కన్నీటిపర్యంతం అవుతుండటం శోచనీయం.. ఈ అక్రమ వ్యవహారం వెనకాల ఒక ప్రముఖ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి చక్రం తిప్పుతున్నట్లు సమాచారం.. కార్మికుల కష్టాలకు అండగా ఉండాల్సిన వాడే వారిని నరకయాతన పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు వాపోతున్నారు.. ఈ భాగోతం వెనుక దాగిన అసలు నిజాలను ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకుని రానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు