Tuesday, April 16, 2024

బరితెగించిన వరిటెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ..

తప్పక చదవండి

  • రామ సముద్రం కుంటను దురాక్రమణ చేసిన వైనం..
  • అక్రమార్కులతో నీటి పారుదల, రెవెన్యూ అధికారులు చెట్టా పట్టాల్..!
  • క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండానే జీ.హెచ్.ఎం.సి. అనుమతులు..
  • వందల కోట్ల విలువైన భూమి అక్రమార్కుల పాలు..
  • మియాపూర్ మదీనా గూడలో వెలుగు చూసిన దుర్మార్గం..

హైదరాబాద్, 28 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మిషన్ కాకతీయలో బాగంగా కనుమరుగైన చెరువులు, కుంటలను గుర్తించి.. పూడికలు తీసి.. నీటితో కళకళలాడే విధంగా.. కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది.. అయితే దురదృష్టం ఏమిటంటే.. నీటి వనరులను కంటికి రెప్పలా కాపాడల్సిన నీటి పారుదల, రెవెన్యూ అధికారులు.. అక్రమార్కులతో చేతులుకలిపి, లోలోపల ఒప్పొందాలు కుదుర్చుకుంటూ పరోక్షంగా ఆయా చెరువులు, కుంటలను తెగనమ్మి సొమ్ము చేసుకుంటున్నారనే బహిరంగ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. నీటి పారుదల శాఖ అధికారులు చెరువులు, కుంటలకు ఎన్.ఓ.సి. జారీ చేయటంతో.. హెచ్.ఎం.డి.ఏ.., జీ.హెచ్.ఎం.సి., డి.టి.సి.పి., టౌన్ ప్లానింగ్ విభాగం కనీసం క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండానే అడ్డగోలుగా అనుమతులు మంజూరు చేస్తున్నారు.. దీనితో కుంటలు, చెరువులు కనుమరుగై.. భారీ బహుళ అంతస్థుల నిర్మాణాలు వెలుస్తున్నాయి.. ఈ మేరకు “ఆదాబ్” అందిస్తున్న ప్రత్యేక కథనం..

- Advertisement -

హైదరాబాద్, 28 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి రెవెన్యూ మండల పరిధిలోని మియాపూర్, మదినాగుడ గ్రామంలో.. రామ సముద్రం కుంటలో సుమారు రెండు ఎకరాలు ఆక్రమణకు గురైందని స్థానికులు ఆరోపిస్తున్నారు.. జీ.హెచ్.ఎం.సి. లేక్ నోటిఫైడ్ కుంటలో 9 ఎకరాల 4 గుంటల విస్తీర్ణంలో రామ సముద్రం కుంట ఉన్నట్లుగా లేక్ మ్యాప్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.. కాగా బహుళ జాతి కంపెనీకి చెందిన ‘వరీటెక్స్ విరాట్’ అనే నిర్మాణ సంస్థ సుమారు రెండు ఎకరాల వరకు ఆక్రమించి, అక్రమ నిర్మాణం సాగిస్తోందని బహిరంగ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. చెరువులు, కుంటలు సుందరీకరణలో బాగంగా.. కనుమరుగైన వాటిని గుర్తించి వాటి అభివృద్ధికి ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది.. ప్రభుత్వ ఆశయాలకు తూట్లు పొడుస్తూ కొందరు అవినీతి అధికారులు అక్రమార్కులతో కుమ్మకై తమ అవినీతి దందా యదేచ్ఛగా సాగిస్తున్నారు.. కేవలం నీటి పారుదల శాఖ అధికారులు జారీ చేసే ఎన్.ఓ.సి. ద్వారానే ఆక్రమణదారులు జి.హెచ్.ఎం.సి. , హెచ్.ఎం.డీ.ఏ., డి.టి. సి.పి., రెరా, ఎయిర్ పోర్ట్ అథారిటీ, పిసిబి, ఎన్.జి.టి. వంటి కార్యాలయాల నుండి సునాయాసంగా అనుమతులు పొందుతున్నారు.. దీనితో 30 అంతస్తుల నుండి 50 అంతస్తుల వరకు టవర్ల అనుమతులు అక్రమార్కులు దొడ్డి దారిన పొందుతున్నారు..నీటి పారుదల శాఖ అధికారులు జారీ చేసిన ఎన్.ఓ.సి.ని గుడ్డిగా నమ్మకుండా టౌన్ ప్లానింగ్ విభాగం క్షేత్ర స్థాయిలో పరిశీలించినట్లయితే వాస్తవ పరిస్థితులతో బాటు కుంటలు, చెరువుల్లో నిర్మాణాలు బయట పడుతాయని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు..

ఇది ఇలా ఉంటే వరీ టెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ.. అర్దబలం, రాజకీయ బలంతో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులను తమ గుప్పిట్లో పెట్టుకొని రామ సముద్రం కుంటను.. సుమారు రెండు ఎకరాలు చెరబట్టి, ఆక్రమించి దొడ్డి దారిలో 6 టవర్ల తో 30 అంతస్తుల నిర్మాణ అనుమతులు పొందినట్లు ఈ ప్రాంతంలో బహిరంగ చర్చ జరుగుతోంది.. అక్రమించిన స్థలం విలువ రెండు వందల కోట్ల పైమాటే ఉంటుందని ఈ ప్రాంతంలో ఏ ముగ్గురు కలిసినా ప్రధాన చర్చగానే జరుగుతుంది.. అంతే కాకుండా పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 210 లో 13 ఎకరాల 9 గుంటల భూమిలో ఈ నిర్మాణ సంస్థ కొంత బాగానికి ఎసరు బెట్టినట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికైనా నీటి పారుదల, రెవెన్యూ యంత్రాంగం స్పందించి.. దురాక్రమణకు గురైన మియాపూర్, మదీనా గూడలో గల రామ సముద్రం కుంటను సర్వే చేసి.. సర్వే నెంబర్ 210 లో గల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు