Saturday, April 20, 2024

దశాబ్ది ఉత్సవాల స్పీచ్.. కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే

తప్పక చదవండి
  • అభివృద్ధి అంటే ఆత్మహత్యలు, కమీషన్లా ? అని మహ్మద్ అశ్రఫ్ ఫైర్
  • దోచుకున్న డబ్బులతో దేశ రాజకీయాలు చేస్తున్నారని విమర్శ

హైదరాబాద్: “దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేసీఆర్ ఇచ్చిన స్పీచ్ అన్నీ అబద్ధాలే ఉన్నాయి. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నడు. పదేండ్లలో కేసీఆర్ సాధించింది అప్పులు, ఆత్మ హత్యలు, కమీషన్లు మాత్రమే. ఆయన కమీషన్లు, భూకబ్జాలు, దందాలు చూసి దేశమే నవ్వుకుంటున్నది”అని వైఆర్ ఏ హేచ్ నేషనల్ సోషల్ కోఆర్డినేటర్ మహ్మద్ అశ్రఫ్ అలీ మండిపడ్డారు. సకల జనుల పోరాటాన్ని తెలంగాణ రూపంలో కేసీఆర్ చేతిలో పెడితే… రాష్ట్రాన్ని అప్పుల పాళేశారని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎడమ కాలు చెప్పు కింద తొక్కిపెట్టారని ఫైర్ అయ్యారు. సర్వతోము ఖాభివృద్ధి, ఉజ్వల ప్రగతి అంటే ఏంటి? అని ప్ర శ్నించారు. నిధులు, నీళ్లు, నియామకాలను మంటగలపడమా ? రెండు సార్లు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడమా? అని నిలదీశారు. మరో ఉద్యమానికి సిద్ధం కావాలి..

“ఫ్రీ కరెంట్ అని డిస్కమ్లను రూ.26 వేల కోట్ల అప్పుల్లోకి నెట్టిండు. తొమ్మిదేండ్లలో 2 లక్షల ఇండ్లే నిర్మించిండు. డిజైన్ మార్చి కాళేశ్వరం పేరుతో వేల కోట్లు దోచుకున్నడు. రూ.14 వేల పంట నష్టం ఎగ్గొట్టిండు. ఫీజు రీయింబర్స్ మెంట్ రూ.5 వేల కోట్ల బకాయి పట్టడు. 50 లక్షల నిరుద్యోగులను మోసం చేసిండు. ఇదేనా అభివృద్ధి అంటే?” అని మహ్మద్ అశ్రఫ్ ఫైర్ అయ్యారు. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయని గృహలక్ష్మి, లక్ష రుణం, గొర్రెలు, బర్రెలు, పనిముట్లు అంటూ కొత్త నాటకాలకు తెరలేపారని విమర్శించారు. దోచు కున్న డబ్బుతో దేశ రాజకీయాలు చేయడం.. ఇదే నవ తెలంగాణ. ఇదే తెలంగాణ మోడలా? అని ప్రశ్నించారు. ఉద్యమ తెలంగాణ మళ్లీ ఉద్యమాల తెలంగాణగానే మారిందన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలన అంతం చేయడానికి మరో దఫా ఉద్యమం ప్రారంభించాల్సిన సమయం వచ్చిందని వివరించారు. కేసీఆర్ పాలన అంతమైతేనే సంక్షేమ, స్వయం సమృద్ధి తెలంగాణ సాధ్యం అవుతుందని అభిప్రాయపడ్డారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు