Friday, April 26, 2024

కేసీఆర్ ప్రభుత్వం సైధవుడి పాత్ర పోషిస్తోంది..

తప్పక చదవండి

తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి..

నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుంటే వాటిని తెలంగాణలో అమలు కాకుండా కేసీఆర్ ప్రభుత్వం సైంధవుడు పాత్ర పోషిస్తున్నదని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. కెసిఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల అవలంబిస్తూ రైతుల ఉసురుతీస్తున్నదని భౌగోళిక విస్తీర్ణం కోణంలో దేశంలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రంగా తెలంగాణ ఉండడం దురదృష్టకరమని అన్నారు.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన తెలంగాణలో అమలు చేయకపోవడం వల్ల అతివృష్టితో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునే అవకాశాన్ని కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర రైతులకు అందకుండా మిల్లర్లతో పౌరసరఫరాల శాఖ కుమ్మక్కై నిలువునా ముంచిందన్నారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పరామర్శించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన తర్వాతనే ప్రగతి భవన్ నుండి కెసిఆర్ పొలంబాట పట్టాడు అన్నారు. ప్రగతిభవన్ లో నిద్రపోతున్న కేసీఆర్ ను పొలాల్లోకి రప్పించిన ఘనత కిసాన్ మోర్చాదే అన్నారు.. 2018 లో తిరిగే అధికారంలోకి రావడానికి రైతులకు లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణాన్ని మాఫీ చేస్తానని ఆ మాటే మరిచిన కేసీఆర్ కు రైతులు ఎప్పుడు ఎన్నికలు జరిగినా తగురీతిలో బుద్ధి చెప్తారు అన్నారు.

- Advertisement -

తెలంగాణలో రెవెన్యూ సంస్కరణల పేరుతో ధరణి పోర్టల్ని ప్రవేశపెట్టి రైతులకు మానసిక వేదన మిగిల్చారని ఆయన ఆరోపించారు. ధరణి పోర్టల్ లో లోపాలను సరిదిద్దకపోతే కిసాన్ మోర్చా రైతుల పక్షాన ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు..

ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ పార్టీ సూచన మేరకు మే 30వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు మహాజన సంపర్క్ అభయాన్ కార్యక్రమంలో భాగంగా కిసాన్ మోర్చా శ్రేణులు చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులతో మండల స్థాయిలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలని, కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన రచ్చబండ సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు కేసీఆర్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసాన్ని వివరించే రైతు చైతన్య కార్యక్రమంలో పాల్గొనాలని, వీటితోపాటుగా రైతు మార్కెట్ల సందర్శన కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించాలని సూచించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు ఉత్పత్తి సంఘాలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో మండల స్థాయిలో రైతు ఉత్పత్తి సంఘాల సమావేశాలు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించాలని ప్రేమేందర్ రెడ్డి పిలుపునిచ్చారు..

ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, పాపయ్య గౌడ్, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు జగన్మోహన్ రెడ్డి, అంజయ్య యాదవ్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బోనేటి కిరణ్ గౌడ్, తిరుపతిరెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిలు మహిపాల్ రెడ్డి, నిరంజన్, గోవర్ధన్ గౌడ్, అలేందర్ గౌడ్, ఇతర రాష్ట్ర పదాధికారులు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు