Friday, July 19, 2024

రిత్విక్ వెంచ‌ర్ అక్రమ నిర్మాణాలు

తప్పక చదవండి
  • గొల్లవాగు బఫర్ జోన్ ల్యాండ్ ను కబ్జా చేసిన రిత్విక్ వెంచర్
  • స.నెం 196లో రిత్విక్ పేరుతో 5 ఎకరాల్లో వెంచర్
  • బ‌ఫ‌ర్ జోన్‌ను క‌బ్జా చేసి 8 -10 ప్లాట్స్ అమ్మేసిన వైనం
  • పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు
  • నిర్మాణదారులకు నోటిసులిచ్చి చేతులు దులుపుకున్న బల్దియా అధికారులు
  • గొల్లవాగు బంఫర్ జోన్ ను కాపాడేదెవ‌రు..?
  • ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టాలన్న స్థానికులు

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి బల్దియా పరిధిలోని గొల్లవాగు బఫర్ జోన్ భూమిలో ఇబ్బడి ముబ్బడిగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజా సంక్షేమం దృష్ట్యా గొల్లవాగు బఫర్ జోన్ ను సంరక్షించాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ ఆఫీసర్లు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. వాగు ల్యాండ్ లో యదేచ్చగా ఇంటి నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ.. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు కనీసం కంటి తుడుపు చర్యలు కూడా తీసుకోవడం లేదు. రంగారెడ్డి జిల్లా సింగపూర్ గ్రామం నుంచి ప్రారంభమవుతున్న గొల్లవాగు శంకర్ పల్లి బల్దియాను టచ్ చేస్తూ.. మూసీ నదిలో కలుస్తుంటుంది. శంకర్ పల్లి మున్సిపాలిటీ లిమిట్స్ లో సుమారు ఈ వాగు ఒకటిన్నర కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంటుంది.

శంకర్ పల్లి బల్దియా లిమిట్స్ లోని గొల్లవాగు సుమారు 10 మీటర్లు వెడల్పును కల్గి ఉంది. బఫర్ జోన్‌ 9 మీటర్లు వరకు ఉంటుంది. ఈ వాగు వల్ల శంకర్ పల్లి మున్సిపాలిటికి బహుళ ప్రయోజనాలున్నాయి. గొల్లవాగు అనేది జనరల్ గానే వాగులాగపోతుంది.. అందువల్ల శంకర్ పల్లి పారిశుద్ధ్య వ్యవస్థకు కూడా వాగు చాలా చక్కగా ఉపయోగపడుతోంది. శంకర్ పల్లి బల్దియాలో ఇంత ప్రయార్టీని సంతరించుకున్న గొల్లవాగు, దాని బంఫర్ జోన్ పరిధిలో వెంచర్లు వెలవడం.. అందులోనే ఇంటి నిర్మాణాలు కొనసాగు తుండడం విశేషం. శంకర్ పల్లి మార్కెట్ దగ్గరలో సర్వే నెంబర్ 196లో 2012లో కొందరు రియల్టర్లు రిత్విక్ పేరుతో సుమారు 5 ఎకరాల్లో వెంచర్ వేయడం జరిగింది. ఈ రిత్విక్ వెంచర్ గొల్లవాగుకు అనుకొనే ఉంటుంది. అయితేే అప్పట్లో రిత్విక్ వెంచర్ వేసిన సదరు రియల్టర్లు పక్కనున్న గొల్లవాగుకు సంబంధించిన బఫర్ జోన్ భూమిని కూడా ప్లాటింగ్ చేసి విక్రయించడం జరిగింది. ఇలా గొల్లవాగు బఫర్ జోన్ కు సంబంధించిన భూమిలో అక్రమంగా 8-10 ప్లాట్స్ గా కొట్టి అమ్మేశారు.

- Advertisement -

బఫర్ జోన్ లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు
2012లో గొల్లవాగు బఫర్ జోన్ పరిధిలో అక్రమంగా ప్లాటింగ్ చేయబడిన ప్లాట్లలో ఇప్పుడు నిర్మాణాలు జరుగుతుండడం గమనార్హం. ప్రస్తుతం ఇక్కడ సుమారు 10 ప్లాట్ల వరకు ఇంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే ఈ అక్రమ ఇంటి నిర్మాణాల తంతు పూర్తైతే గొల్లవాగు, దాని బఫర్ జోన్ కు పెను ప్రమాదం తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. బఫర్ జోన్ పూర్తిగా అక్రమ కట్టడాలతో నిండిపోతే.. నీటిపారుదలకు తీవ్ర విఘాతం కల్గే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే శంకర్ పల్లి బల్దియా పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాాయి. గొల్లవాగుకు రిట‌ర్నింగ్ వాల్స్ కూడా లేవు. దీంతో అక్రమ నిర్మాణదారులు కూడా సులభంగా ఇల్లిగల్ గా ఇంటి నిర్మాణాలను చేపడుతున్నారు.

అయితే ఇంత జరుగుతున్నా.. రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు అస్సలు పట్టించు కోకపోవడం విస్మయం కల్గిస్తోంది. శంకర్ పల్లి బల్దియాలో గజం రూ.40-60 వేేల వరకూ పలుకుతోంది. దీంతో అక్రమంగా ఇంటి నిర్మాణాలు చేపట్టాలనుకుంటున్న వారు ఎలాగో ఒకలా అధికారులను మచ్చిగా చేసుకుంటున్నారు. అందులో భాగంగానే రిత్విక్ వెంచర్ పక్కన అక్రమంగా ఇంటి నిర్మాణాలు చేపడుతున్న వారు సైతం రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులను మ్యానేజ్ చేసుకొని యదేచ్చగా
నిర్మాణాలు చేేసుకుంటున్నట్లు అర్థమవుతోంది. అయితే శంకర్ పల్లి బల్దియాకు అత్యంత కీలకమైన గొల్లవాగు, దాని బఫర్ జోన్ లో అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నా.. కేవలం ఆమ్యామ్యా లకు ఆశపడి ఇల్లిగల్ గా ఇంటి నిర్మాణాలకు అనుమతులివ్వడం గమనార్హం. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ వ్యవహారంపై నజర్ పెడితే శంకర్ పల్లి బల్దియాలోని అధికారుల అవినీతి భాగోతం మొత్తం బయట పడడంతో పాటు.. ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే వాగు, దానికి సంబంధించిన బఫర్ జోన్ ను కూడా సంరక్షించుకునే అవకాశాలున్నాయి.

మున్సిపల్ కమిషనర్..
గొల్లవాగు పరిధిలోని రిత్విక్ వెంచర్ కాల్వలో నిర్మాణాలు జరుగుతున్న విషయమై పనులు నిలిపివేయాలని ఇంటి యజమానికి నోటీసులు పంపించడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు పరిశీలించిన తర్వాత మండల రెవెన్యూ అధికారితో కలిసి అక్రమ నిర్మాణం జరిగినట్లయితే దానిని కూల్చివేయడం జరుగుతుంది. ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవన్నారు.

ఇరిగేషన్ ఏఈ
రిత్విక్ వెంచర్ పాతది. ఎన్వోసీ ఇచ్చారో లేదో చూస్తున్నాం. తహశీల్దార్ కార్యాలయానికి లేఖ రాస్తున్నాం. గొల్లవాగుకు సంబంధించిన బౌండరీస్ ను రెవెన్యూ, సర్వేయర్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అపుడే మేం సదరు ప్లాట్లు బంఫర్ జోన్ పరిధిలోకి వస్తాయా..? లేదా..? అనేది నిర్ధారించగలం. అలా కాకుండా మేము ఏదైనా చేస్తే సదరు వ్యక్తి మాపై కేసు పెట్టే అవకాశాలున్నాయి. మున్సిపాలిటీ నుండి మాకు ఎంక్వైరీ చేయమని నోటీసులు వచ్చాయి. అయితే వెంచర్ పాతది కాబట్టి మా దగ్గర కల్వర్టు పర్మిషన్ లెటర్ ఉంది. ఇంకా ఎన్ఓసీ కోసం వెంచర్ చేసిన వ్యక్తి మొబైల్ నంబర్ కోసం ట్రై చేస్తున్నాం. రెవెన్యూ వాళ్ళు హద్దులు చూపిస్తే మేము ఐదు నిమిషాల్లో పనిని పూర్తి చేయగలం.

రెవెన్యూ ఇన్స్‌పెక్ట‌ర్‌
రిత్విక్ వెంచర్ 2012లోనిది. గృహ నిర్మాణం స్లాబ్ వరకు కన్స్ట్రక్షన్ కావడంతో ఇంటి నెంబర్ అప్పట్లోనే మంజూరు చేయడం జరిగింది. కావున ఇప్పుడు మున్సిపల్ వాళ్లు కన్స్ట్రక్షన్ ఆపమని నోటీసులు కూడా పంపడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ వాళ్ళు ఏదైనా చర్య తీసుకో వాలని కోరుతున్నాం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు