Saturday, June 10, 2023

గంగానదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి.. జాడ తెలియని 25 మంది..

తప్పక చదవండి

ఉత్తరప్రదేశ్‌ లోని బల్లియా జిల్లా లో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 40 మందితో వెళ్తున్న పడవ మల్దేపూర్‌ గంగా ఘాట్‌ సమీపంలో గంగా నదిలో బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాన్ని గమనించి స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నీటిలో మునిగిపోయిన కొందరిని రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 20 నుంచి 25 మంది వరకు గల్లంతైనట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారికోసం అధికారులు గాలింపు చేపడుతున్నారు. సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణికుల్ని ఎక్కించడమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.

- Advertisement -
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -spot_img

మరిన్ని వార్తలు

- Advertisement -spot_img