Thursday, April 18, 2024

సంగీత దిగ్దర్శకులు రాజ్ అస్తమయం

తప్పక చదవండి
  • గత కొద్దికాలంగా అనారోగ్యంతో చికిత్స..
  • ఆదివారం అకశ్మీకంగా మృతి..
  • రాజ్ మృతి జీర్ణించుకోలేకపోతున్నా : కోటి..
  • నివాళులర్పించిన ప్రలువురు సినీరంగ ప్రముఖులు..
  • నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు..

హైదరాబాద్ : టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం రోజు తుదిశ్వాస విడిచారు. తెలుగులో ఎన్నో హిట్ సినిమాలకు పనిచేసిన రాజ్.. ప్రళయగర్జన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత సంగీత దర్శకుడు కోటీతో కలిసి ఎన్నో సూపర్ హిట్ పాటలను కంపోజ్ చేసాడు. యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి, బాలగోపాలుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, అన్న-తమ్ముడు లాంటి విజయవంతమైన చిత్రాలకు వీరే సంగీతాన్ని సమకూర్చారు. రాజ్ ఒంటరిగా సంగీతం అందించిన సినిమాల్లో “సిసింద్రీ” ఒక్కటే చెప్పుకోదగినది. అన్ని భాషల్లో కలిపి 455 చిత్రాలకు పనిచేసిన రాజ్.. 24 చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించారు. రాజ్ మృతి పట్ల టాలీవుడ్ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

కాగా ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్‌ మరణంపై ఆయన స్నేహితుడు కోటి స్పందించారు. రాజ్ చనిపోయారనే వార్తను తాను జీర్ణించుకోలేకపోతోన్నాని అన్నారు. ఈ మధ్యనే ఓ సినిమా ఫంక్షన్‌లో కలుసుకున్నామని చెప్పారు. అయితే ఆరోగ్య సమస్యలున్నట్టుగా రాజ్ తనకు చెప్పలేదన్నారు కోటి. రాజ్ కోటిగా మేమిద్దరం ఎన్నో సినిమాలకు కలిసి పని చేశామని, ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చామని కోటి చెప్పుకొచ్చారు. తామిద్దరం విడిపోయిన తరువాత కోటిగా తాను ఎన్ని సినిమాలు చేసినా.. వాటిని కూడా రాజ్ కోటి పాటలు అనేవారని తెలిపాడు. చక్రవర్తి దగ్గర మేమిద్దరం అసిస్టెంట్లుగా పని చేశామని చెప్పిన కోటి.. ముఠామేస్త్రి, హలోబ్రదర్స్ లాంటి ఎన్నెన్నో బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చామని చెప్పుకొచ్చాడు. తెలుగులో మేమిద్దరం ఓ ట్రెండ్‌ను సృష్టించామని తెలిపాడు. సినిమా కోసం ఇరవై నాలుగు గంటలూ పని చేసేవాళ్లమని అలాంటిది ఈ రోజు రాజ్ లేడంటే ఎంతో బాధగా ఉందన్నారు. కాల ప్రభావం, పరిస్థితుల వల్ల తాము విడిపోయామని , తానూ ఎన్ని సినిమాలు చేసినా రాజ్ తన పక్కన ఉన్నాడనే ధైర్యంతోనే చేయగలిగాన్నారు కోటి. రాజ్‌కి తానొక తమ్ముడిలాంటి వాడినిని తెలిపారు. తామిద్దరం చిన్ననాటి స్నేహితులమని, మేము విడిపోవడం తనకు ఇప్పటికీ బాధగానే ఉంటుందని తెలిపాడు. అప్పటి పరిస్థితుల వల్ల విడిపోయామని చెప్పుకొచ్చిన కోటి.. తమ పాటల రూపంలో రాజ్‌ ఎప్పటికీ బతికే ఉంటాడని తెలిపాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు