Friday, April 26, 2024

మహేష్ బాబు మాస్ లుక్..

తప్పక చదవండి
  • హిట్ కొట్టాలని చూస్తున్న త్రివిక్రమ్..
  • మహేష్ ఫ్యాన్స్ కి ఇక పండుగే..
  • నెట్టింట హల్ చల్ చేస్తున్న ఫస్ట్ లుక్..

టాలీవుడ్‌లో రాబోతున్న ఇంట్రెస్టింగ్‌ సినిమాల్లో ఒకటి ఎస్‌ఎస్‌ఎంబీ 28 . సిల్వర్‌ స్క్రీన్‌పై హ్యాట్రిక్‌ హిట్టు కొట్టేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ మహేశ్ బాబు మరోసారి రెడీ అవుతున్నారు. ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ ఇప్పటికే నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. ఎస్‌ఎస్‌ఎంబీ 28 ఫస్ట్‌ గ్లింప్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోసం ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. మే 31న ఎస్‌ఎస్‌ఎంబీ 28 ఫస్ట్‌ గ్లింప్స్‌ తోపాటు టైటిల్‌ కూడా రెడీ అవుతున్నట్టు ఓ వార్త హల్‌ చల్ చేస్తోంది. మరి దీనిపై మేకర్స్ నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఎస్‌ఎస్‌ఎంబీ 28 పూజాహెగ్డే, శ్రీలీల ఫీ మేల్ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. దూకుడు, ఆగడు, సర్కారు వారి పాట సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన ఎస్‌ థమన్‌ ఎస్‌ఎస్‌ఎంబీ 28కి మరోసారి సంగీతం అందిస్తుండటంతో.. మరోసారి గూస్‌బంప్స్ తెప్పించే ఆల్బమ్‌ రావడం ఖాయమని ధీమాగా ఉన్నారు మూవీ లవర్స్‌.

ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్‌ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. మహేశ్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన అతడు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టగా.. ఖలేజా మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఎస్‌ఎస్‌ఎంబీ 28 ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు