Thursday, April 25, 2024

తెలంగాణ ఐసెట్‌ హాల్‌ టికెట్స్‌ విడుదల

తప్పక చదవండి
  • మే 26, 27 తేదీల్లో రెండు సెషన్లలో పరీక్ష నిర్వహణ..
  • ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12-30 గం. వరకు పరీక్ష..
  • ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాలు ఈ పరీక్ష ద్వారా కల్పిస్తారు..

హైదరాబాద్‌ :తెలంగాణ ఐసెట్‌ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి.తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ మే 22న టి.ఎస్‌. ఐసెట్‌ 2023 హాల్‌టికెట్లను విడుదల చేసింది. తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://icet.tsche.ac.in ద్వారా తమ అడ్మిట్‌ కార్డ్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 2023 విద్యాసంవత్సరానికి గాను వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఈ పరీక్షను మే 26, 27 తేదీల్లో రెండు సెషన్లలో నిర్వహిం చనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాలు కల్పిస్తారు.
హాల్‌ టికెట్స్‌ని ఇలా డౌన్‌ లోడ్‌ చేసుకోండి..
icet.tsche.ac.inలో టి.ఎస్‌. ఐసెట్‌ యొక్క అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. హోమ్‌ పేజీలో, ‘‘హాల్‌ టిక్కెట్‌ను డౌన్‌ లోడ్‌ చేయండి’’ లింక్‌పై క్లిక్‌ చేయండి. రిజిస్ట్రేషన్‌ నంబర్‌, అర్హత పరీక్ష హాల్‌ టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీని నమోదు చేయండి. టి.ఎస్‌. ఐసెట్‌ హాల్‌ టికెట్‌ 2023 మీ స్క్రీన్‌పై ప్రదర్శించ బడుతుంది. హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, ప్రింటవుట్‌ తీసుకోండి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు