Tuesday, October 15, 2024
spot_img

ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌లో తెలుగు టాలన్స్..

తప్పక చదవండి
  • నూతన జెర్సీ ఆవిష్కరణ
  • హ్యాండ్‌బాల్‌ జట్టు కెప్టెన్, స్పాన్సర్‌లను ప్రకటించిన ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్, నరసింహ రెడ్డి (వీసీ, జేఎన్‌టీయూ)

హైదరాబాద్‌ ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ (పీహెచ్‌ఎల్‌) ప్రారంభ సీజన్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న హ్యాండ్‌బాల్‌ టీమ్‌ ‘తెలుగు టాలన్స్’ వారి నూతన జెర్సీని ఆవిష్కరించారు. సోమవారం హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్ టీయూహెచ్‌) లోని ఇండోర్‌ స్టేడియంలో హ్యాండ్‌బాల్‌ క్రీడాభిమానులు, విద్యార్థుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమలు – వాణిజ్యం, సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్, జెఎన్ టియుహెచ్‌ వైస్‌–ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె. నరసింహా రెడ్డి పాల్గొని కొత్త జెర్సీని ఆవిష్కరించడంతో పాటు జట్టు కెప్టెన్, స్పాన్సర్‌లను కూడా ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ సీజన్‌కు తెలుగు టాలన్స్ కెప్టెన్‌గా ‘శుభమ్‌ షియోరాన్ ’ను ప్రకటించారు.

ఈ సందర్భంగా జట్టు యజమాని అభిషేక్‌ రెడ్డి మాట్లాడుతూ., ప్రస్తుత సీజన్‌కు ప్రధాన స్పాన్సర్‌గా ఏ23, అసోసియేట్‌ స్పాన్సర్‌గా ప్యారడైజ్‌ వ్యవహారిస్తారని ప్రకటించారు. జేఎన్ టీయూ, ఆక్సిలోన్స్, మల్లా రెడ్డి యూనివర్సిటీ, యాడ్‌ ప్రకాష్‌ ప్రాజెక్ట్స్‌ లు ఇతర అసోసియేట్‌ స్పాన్సర్లుగా కొనసాగనున్నారని తెలిపారు.
కొత్త టీం, స్పాన్సర్లతో ఈ సీజన్‌లో ఉత్సాహాంగా పాల్గొనడానికి సిద్దంగా ఉన్నామని అభిషేక్‌ రెడ్డి అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న ‘తెలుగు టాలన్స్’ అత్యుత్తమ ప్రదర్శనను ఇవ్వడానికి సన్నద్దమౌతున్నారని అన్నారు. ‘తెలుగు టాలన్స్’కు ప్రోత్సాహం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్, నరసింహ రెడ్డిలకు జట్టు యజమాని అభిషేక్‌ రెడి ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు.

- Advertisement -

కెప్టెన్‌ను ప్రకటించిన సందర్భంగా కోచ్‌ ‘ఫెర్నాండో న్యూస్‌’ స్పందిస్తూ., ‘శుభమ్‌ షియోరాన్ ’ ఆటలో అపారమైన అనుభవమున్న క్రీడాకారుడు, అంతేకాకుండా మంచి వ్యూహకర్త. తను ఆటగాళ్లందరికీ అనువుగా ఉంటూ, మా వ్యూహాలను సరైన మార్గంలో తీసుకెళ్లగలడని ఆశిస్తున్నాం. ఇలాంటి అద్భుతమైన నాయకత్వ లక్షణాలను పరిగణించే శుభమ్‌ని కెప్టెన్ గా ఎంచుకున్నాము. జట్టుపైన ఉన్న అంచనాలకు అనుగుణంగా సమర్థవంతంగా జట్టును నడిపించగల సామర్థ్యం తన సొంతం’’ అని కోచ్‌ ‘ఫెర్నాండో న్యూస్‌’ పేర్కొన్నారు. నూతన జెర్సీ ఆవిష్కరణ అనంతరం తెలుగు టాలన్స్ జట్టు ప్రతిభను, నైపుణ్యాన్ని చాటిచెప్పేందుకు ప్రత్యేకంగా ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో క్రీడాకారులు కనబర్చిన క్రీడా నైపుణ్యాలకు ముగ్దులైన అభిమానులు., సంతోషంతో జట్టుకు అభినందనలను తెలిపారు. ఈ మ్యాచ్‌లో నిర్వహాణలో హెడ్‌ కోచ్‌ ఫెర్నాండో, అసిస్టెంట్‌ కోచ్‌ సచిన్‌ పాల్గొన్నారు.

పీహెచ్‌ఎల్‌ సీజన్‌ వివరాలు :
ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌లో తెలుగు టాలన్స్ 10 మ్యాచ్‌లు ఆడనుంది. వారి మొదటి మ్యాచ్‌ జూన్‌ 8న గర్విట్‌ గుజరాత్‌తో జరుగుతుంది. ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ ప్రారంభ సీజన్‌ వయాకామ్‌18లో ప్రసారం చేయబడుతుంది. దీనితో పాటు జియో సినిమా, స్పోర్ట్స్ 18-1 (హెచ్.డీ. అండ్ ఎస్.డీ.), స్పోర్ట్స్ 18 ఖేల్‌లో తదితర బహుళ స్థాయి మాద్యమాల్లో ప్రసారం అవుతుంది. ఈ వేదికల్లో జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియం నుంచి లీగ్‌ టోర్నీని ప్రేక్షకులు ప్రత్యక్షంగా ప్రసారాన్ని వీక్షించవచ్చు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు