Sunday, December 10, 2023

పవన్‌ కళ్యాణ్‌తో నీకు పోలికా

తప్పక చదవండి

మంత్రి గుడివాడపై బుద్దా ఫైర్‌

విశాఖపట్టణం (ఆదాబ్ హైదరాబాద్) : రాజకీయాల్లో ఏదిపడితే అది మాట్లాడం సరికాదని, అందుకు ప్రజలు తగిన బుద్ది చెబుతారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్‌ అయ్యారు. జగన్‌ పిచ్చి గుడివాడ అమర్‌కి కూడా పట్టినట్లు ఉందని విమర్శించారు. పవన్‌ కంటే…తన తోనే ఎక్కువ మంది సెల్ఫీ లు తీయంచుకుంటారని ఒక ఇంటర్వ్యూ లో గుడివాడ చెప్పారని పేర్కొన్నారు. పవన్‌తో నీకు పోలికేంటని ప్రశ్నించారు. మంత్రిగా ఉంటూ ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. పవన్‌ వచ్చినప్పుడు అనకాపల్లి సెంటర్‌లో అమర్‌నాథ్‌ నిల్చుంటే ప్రజలు బట్టలు ఊడదీసి కొడతారని ఎద్దేవా చేశారు. అమర్నాధ్‌ ఒన్‌ టైం ఎమ్మెల్యే..మళ్లీ గెలవడన్నారు. గుడివాడ అమర్‌నాథ్‌ వలన విశాఖలో వైసీపీ ఖాళీ అవుతుందన్నారు. మంత్రి అమర్నాధ్‌ జేబులో రెండు జెండాలు పెట్టుకుని తిరుగుతాడని విమర్శించారు. కాపులకు పవన్‌ కళ్యాణ్‌ ప్రతినిధని…ఈసారి అమర్నాధ్‌కు కాపులు బుద్ధి చెపుతారని హెచ్చరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు