Sunday, September 15, 2024
spot_img

క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే సీఎం క్రీడా కప్‌ లక్ష్యం: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

తప్పక చదవండి

జడ్చర్ల 17 మే (ఆదాబ్ హైదరాబాద్) : గ్రామీణ స్థాయిలో ప్రతిభగల క్రీడాకారులను వెలికి తీయడమే లక్ష్యంగా సీఎం క్రీడా కప్ పోటీలను నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఈ క్రీడా కప్‌ పోటీలను ప్రారంభించారని అన్నారు. జడ్చర్ల మండల కేంద్రంలో జరుగుతున్న మండల స్థాయి సీఎం క్రీడా కప్‌ ముగింపు పోటీలను మంత్రి తిలకించారు. మంత్రితోపాటు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా ఉన్నారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారని, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు రాష్ట్రస్థాయికి వెళ్తారని మంత్రి పేర్కొన్నారు. జడ్చర్ల నియోజకవర్గం నుంచి అత్యధిక స్థాయిలో క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు